Prime9

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం కారణంగా 18 రైళ్లు రద్దు.. ఏవేవంటే ?

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా మహా విషాద ఘటనగా నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 237 మంది మరణించగా.. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా జరిగిన రైలు ప్రమాదాలను పరిశీలిస్తే ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం పెద్దదని చెప్పాలి. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్ళను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అదే విధంగా టాటా నగర్ స్టేషన్ మీదుగా మరో ఏడు రైల్లు దారి మళ్లించినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు.

రద్దయిన రైల్లు వివరాలు (Odisha Train Accident)..

హావ్ డా-పూరీ సూపర్ ఫాస్ట్ (12837)

హావ్ డా బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12863)

హావ్ డా-చెన్నై మెయిల్

హావ్ డా- సికింద్రాబాద్ (12703)

హావ్ డా-హైదరాబాద్ (18045)

హావ్ డా-తిరుపతి (20889)

హావ్ డా- పూరి సూపర్ ఫాస్ట్ (12895)

హావ్ డా- సంబల్ పుర్ ఎక్స్ ప్రెస్ (203831)

సంత్రగాచి-పూరీ ఎక్స్ ప్రెస్ (02837)

ఇక బెంగళూరు -గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్ళించారు.

Railways doubles compensation for train accident victims | Latest News  India - Hindustan Times

ఖరగ్పూర్ డివిజన్ లో  ఉన్న చెన్నై సెంట్రల్-హావ్ డా (12840) రైలును జరోలీ మీదుగా.. వాస్కోడిగామా-షాలిమార్ (18058), సికింద్రాబాద్- షాలిమార్ (22850) వారాంతపు రైళ్లను కటక్ అంగోలు మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇక మరోవైపు ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో.. గోవా – ముంబై మధ్య ప్రారంభించనున్న వందే భారత్ రైలు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మడ్గావ్ స్టేషన్ నుంచి ప్రారంభించాల్సిన గోవా – ముంబై వందే భారత్ రైలు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా కొంకన్ రైల్వే అధికారులు ప్రకటించారు.  ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ప్రధాని మోదీ వెర్చువల్ పద్ధతిలో ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. కాగా ఈ ఘోర విషాదం కారణంగా వాయిదా వేయడం జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ జిల్లాలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలు ట్రాక్ పై పడ్డాయి. అప్పుడే వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. దీని వల్ల కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. అనంతరం బోల్తాపడిన కోరమండల్ బోగీలపైకి గూడ్సు రైలు దూసుకువచ్చి ఢీకొంది అని భావిస్తున్నారు. మూడు రైళ్లు ఒకదాంతో మరొకటి ఢీకొనడంతో ప్రమాదం (Odisha Train Accident) తీవ్రత అనూహ్యంగా పెరిగింది. అయితే అధికారులు ఈ ప్రమాదం గురించి మరో విధంగా కూడా వివరించడం ఇప్పుడు పలు ప్రశ్నలకు దారి తీస్తుంది.

Exit mobile version
Skip to toolbar