Site icon Prime9

Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు జీవితఖైదు.. ఎవరి వివాదాస్పద బాబా?

asharam bapu

asharam bapu

Asaram Bapu: ప్రముఖ.. ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు గుజరాత్ కోర్టు జీవితఖైదు విధించింది. 2013 నాటి అత్యాచార కేసులో దోషిగా తేలడంతో.. గాంధీనగర్ కోర్టు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. కానీ ఇప్పటికే.. మరో రేప్ కేసులో ఆశారం బాపూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు.

2013లో గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో అత్యాచారానికి గురైనట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001-2006 వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆశారంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఆశారాంను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. మిగతా ఆరుగురిని నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. గతంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా ఉన్నారు. ఈ కేసులోనూ జీవితఖైదు అనుభవిస్తున్నారు.

ఎవరు ఈ ఆశారాం బాపూ?

ప్రస్తుత పాకిస్థాన్ లో సింధ్ ప్రాంతంలో 1941లో ఆశారం జన్మించారు. ఇతని అసలు పేరు అసుమల్ హర్పలానీ.

1947 విభజన అనంతరం.. ఆశారం కుటుంబం అహ్మదాబాద్ స్థిరపడింది.

1960 లో ఆధ్యాత్మిక గురువు వద్ద శిష్యునిగా చేసిన ఇతను.. 1972లో మొదటి ఆశ్రమాన్ని స్థాపించారు.

ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో.. మిగతా రాష్ట్రాలకు ఈ ఆశ్రమాలు విస్తరించాయి.

ప్రవచనాలు, నాటుమందులు, కీర్తనల పేరుతో ప్రజలకు దగ్గరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా ఆశారాంకు నాలుగు కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారు.

ఆశారాం తన కుమారుడు నారాయణ్ సాయితో విదేశాల్లోను ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు.

సుమారు ఆశారాంకు రూ. 10వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేసు ఏంటి అసలు?

ఆశారాం బాపు అత్యాచారం చేశాడంటూ.. 2013లో ఓ మహిళ కేసు పెట్టారు.

ఈ కేసులో మరో ఏడుగురిని కూడా నిందితులుగా చేర్చారు.

2001 నుంచి 2006 మధ్య బాధితురాలిపై ఆశారాం అనేకసార్లు అత్యాచారం చేసినట్లు తేలింది.

అప్పటికే ఆయన మరొక రేప్ కేసులో జైలులో ఉన్నారు.

మైనర్ బాలికన్ రేప్ చేసిన కేసులో.. జోధ్‌పూర్ కోర్టు జీవితకాలశిక్ష విధించింది.

 

జోధ్‌పూర్ కేసు ఏమిటి?

మైనర్ బాలికను రేప్ చేశారనే ఆరోపణలతో 2013లో ఓ కేసు నమోదైంది.

షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబం ఆశారాంను ఆరాధిస్తూ ఉండేది.

అక్కడ ఓ ఆశ్రమాన్ని వారు సొంత ఖర్చుతో నిర్మించారు.

‘కల్చర్ ఎడ్యుకేషన్’ పేరుతో తమ ఇద్దరు పిల్లలను ఆశారాం గురుకులానికి పంపించారు.

కొద్ది రోజులకి16 ఏళ్ల కుమార్తె అనారోగ్యంతో ఉందని వారు సమాచారం అందించారు.

కుమార్తెకు దుష్టశక్తులు ఉన్నాయని ఆశ్రమం సభ్యులు నమ్మించారు.

అనంతరం.. 16 ఏళ్ల బాలికపై తన గుడారంలో.. అశారాం అత్యాచారం చేశారు.

ఈ ఘటనతో బాధిత కుటుంబం షాక్ గురైంది.

బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాడింది.

చివరకు ఆ కేసులో ఆశారాం కు శిక్ష పడింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version