Site icon Prime9

Khushbu Sundar: ఖుష్భూ ట్వీట్ కు కపిల్ సిబల్ స్ట్రాంగ్ రిప్లై

Khushbu Sundar

Khushbu Sundar

Khushbu Sundar: సుదీప్తో సేన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ది కేరళ స్టోరి’. విడుదలకు ముందు నుంచే వివాదాలకు కేరాఫ్ అయింది. కాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. ఈ సినిమా ప్రదర్శనకు కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే.. మరికొంత మంది సపోర్టు చేస్తున్నారు. ఈ చిత్రంపై తాజాగా బీజేపీ నేత ఖుష్భూ సందర్ ట్వీట్ చేశారు. ‘చాలా మందికి ఎన్నో ఏళ్లుగా తెలియని నిజాలను ది కేరళ స్టోరి లో చూపించారు. అసలు సత్యం ఏమిటో నిర్మోహమాటంగా చిత్రీకరించారు. ప్రజలు ఏం చూడాలో వారే నిర్ణయం తీసుకుంటారు. అంతేకానీ మీరు నిర్ణయించకూడదు. తమిళనాడు ప్రభుత్వం ఏవేవో కారణాలు చూపి సినిమాను షోలను రద్దు చేస్తోంది. ఈ చర్చతో ఇది తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా అని పరోక్షంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు’ అని ఖుష్భూ పోస్టు చేశారు.

 

ఘాటుగా స్పందించిన కపిల్ ( Khushbu Sundar)

అయితే ఖుష్భూ పోస్టు పై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘ప్రజలు ఏం చూడాలో వారే నిర్ణయించుకుంటారు. అలాంటప్పుడు పఠాన్, బాజీరావ్ మస్తానీ, పీకే లాంటి సినిమాలకు వ్యతిరేకంగా నిరసనలు ఎందుకు చేయాల్సి వచ్చింది. మీ రాజకీయాలు ద్వేషాన్ని పెంచే విధంగా ఉన్నాయి’ అని సిబల్ వ్యాఖ్యానించారు.

 

యూపీ పన్ను మినహాయింపు

కాగా , ది కేరళ స్టోరీ చిత్రానికి కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నాయి. దీంతో ప్రదర్శనను నిషేధిస్తున్నాయి. ఈక్రమంలోనే వెస్ట్ బెంగాల్ లో చిత్రప్రదర్శనపై నిషేధం విధిస్తూ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోడదన్న ఉద్దేశంతో నిలుపుదల చేసినట్టు ప్రకటించారు. ఎక్కడైనా చిత్రాన్ని ప్రదర్శించినట్టు తేలితే కఠిన చర్చలు తీసుకుంటామన్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ట్విటర్ వేదికగా వెల్లడించారు. మధ్య ప్రదేశ్ కూడా పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

 

సినిమా యూనిట్ బెదిరింపులు

మరో పక్క ఈ చిత్ర దర్శకుడు , ఇతర సిబ్బందికి గుర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపులకు పాల్పడుతూ మెసేజ్ వచ్చింది. ‘ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. మీరు మంచి పనులు చేయలేదు’ అని ఆ మేసేజ్ లో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో దర్శకుడు సుదీప్తో సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా.. సినిమా సిబ్బందికి మాత్రం పోలీసులు భద్రత కల్పించారు.

 

 

Exit mobile version