Site icon Prime9

Karnataka: ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. డీకే సహా 8 మంది మంత్రుల ప్రమాణం

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ వీరి చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ , ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ప్రమాణ స్వీకారానికి ముందు బెంగళూరుకు చేరుకున్న రాహుల్‌, ప్రియాంక గాంధీలకు డీకే శివకుమార్‌ స్వయంగా స్వాగతం పలికారు. దగ్గరుండి ఇరువురిని వేదిక వద్దకు తీసుకొచ్చారు.

 

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Karnataka)

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్‌ సీఎం అశోక్ గహ్లోత్, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశఖ్ భఘేల్, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కుతో పాటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, నటుడు, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

అన్ని వర్గాల వారికీ సమన్యాయం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు మరో ఆరుగురు ఎమ్యెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర, కె హెచ్ మునియప్, కెజె జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జర్ఖిహాళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ లతో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ కు సిద్ధరామయ్య క్యాబినెట్ లో చోటు దక్కింది. అన్ని వర్గాల వారికీ సమ న్యాయం కల్పించేలా క్యాబినెట్ మంత్రి పదవులను కేటాయించినట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

 

Exit mobile version