Site icon Prime9

Jn NTR: బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్..ట్రెండింగ్ లో ఫోటోలు

Junior NTR's photos has gone viral after reaching Bangalore

Bangalore: కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానంమేరకు బెంగళూరుకు చేరుకొన్న టాలివుడ్ నటుడు జూనియరh ఎన్టీఆర్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును అందచేయనున్న కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు.

తారక్‌ బెంగళూరు చేరుకున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతున్నాయి. బెంగళూరుకు బయలుదేరినపుడు విమానంలో తీసిన ఫొటోతోపాటు సిటీలో ల్యాండ్‌ అయ్యాక దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది.

పునీత్‌ రాజ్‌ కుమార్‌ గతేడాది గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కన్నడ పవర్‌ స్టార్‌గా సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను అలరించారు. సమాజ సేవలో కూడా తన వంతు పాత్ర పోషించిన పునీత్ రాజ్‌కుమార్‌ హఠాత్తుగా మరణించారు. ఆయన గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం దివంగత నటుడుకు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది. తమిళసూపర్ స్టార్ రజినీకాంత్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులు ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ బెంగళూరు చేరుకొన్నారు.

ఇది కూడా చదవండి: Actress Rambha: హీరోయిన్ రంభకు గాయాలు.. కారుకు యాక్సిడెంట్‌

Exit mobile version