Site icon Prime9

CM Hemant Soren: బలపరీక్షలో నెగ్గిన సీఎం సోరెన్

Cm Hemant Soren Wins Trust Vote

Jharkhand: జార్ఖండ్‌ అంసెబ్లీలో సిఎం హేమంత్‌ సోరెన్‌ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయ‌న త‌న మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటు వేశారు. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బిజెపి స‌భ నుంచి వాకౌట్ చేసింది.

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎమ్మెల్యేల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల‌ని బిజెపి ప్ర‌య‌త్నిస్తోందని తెలిపారు. దేశంలో ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తున్నార‌ని అన్నారు. జార్ఖండ్‌లో యూపీఏ ఉన్నంత వరకు ఎలాంటి కుట్రలు సాగవని సోరెన్ తెలిపారు.

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ పేరు మీద గనుల తవ్వకం లీజు ఉందని, ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆరోపించారు. దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఫిబ్రవరి 11న గవర్నర్ రమేశ్ బయిస్‌ను కలిసి, ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరింది.

Exit mobile version