Site icon Prime9

Janasena chief Pawan Kalyan: ఢిల్లీకి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

pawan

pawan

Janasena chief Pawan Kalyan: రేపు జరగబోయే ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రైమ్9తో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల భవిష్యత్‌తోపాటుగా ఎన్‌డి పాలసీలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నదానిపై చర్చించే అవకాశాలున్నాయన్నారు. ఏపీ ఎన్నికలపై కూడా ఎన్‌డిఎ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారు.

ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశం..(Janasena chief Pawan Kalyan)

భారతీయ జనతాపార్గీకి వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేసే దిశగా చర్చించడానికి దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు నేడు, రేపు బెంగళూరులో సమావేశమవుతున్నాయి. అదే సమయంలో తనతో కలిసి వస్తున్న పార్టీలతో బీజేపీ రేపు ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి కింద బీజేపీతో పాటు దాని భాగస్వామి పార్టీలకు చెందిన కీలకనేతలు రేపు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటినుంచి భారతీయ జనతాపార్గీతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు సమావేశాలు, బహిరంగ సభల్లో స్పష్టం చేసారు. దీనితో పవన్ కూడా రేపటి సమావేశానికి హాజరవడానికి ఢిల్లీకి చేరుకున్నారు.

అంతకుముందు పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్ తెలిపారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. సుమోటోగా కేసు తీసుకున్నందుకు మానవ హక్కుల కమిషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version