Site icon Prime9

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..రేపు పీఎస్ఎల్వీ సీ 56 రాకెట్ ప్రయోగం

PSLV C56

PSLV C56

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 25.30 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత రేపు ఉదయం 6.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.

కక్ష్యలోకి 7 ఉపగ్రహాలు..(ISRO)

ఈ రాకెట్ ద్వారా ఇస్రో సింగపూర్ కి చెందిన 7 ఉపగ్రహాలని కక్ష్యలోకి పంపనుంది. డీఎస్ – సార్ అనే ప్రధాన ఉపగ్రహంతో పాటు వెలాక్స్-ఏఎం, ఆర్కేడ్, స్కూబ్ 2..నులియన్, గెలాసియా 2, ఓఆర్బీ 12 అనే శాటిలైట్ లని రాకెట్ మోసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 58వ ప్రయోగం కావడం విశేషం. వాణిజ్య ప్రయోగాల్లో పిఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ఇస్రో దూసుకెళ్తోంది.
మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది.

ప్రయోగాన్ని చూసేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని వీక్షణ గ్యాలరీ సందర్శకులకు తెరిచి ఉంటుంది.PSLV-C56 మిషన్ ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇస్తుంది. ST ఇంజనీరింగ్ వారి వాణిజ్య వినియోగదారుల కోసం బహుళ-మోడల్ మరియు అధిక ప్రతిస్పందన చిత్రాలు మరియు భౌగోళిక సేవల కోసం దీనిని ఉపయోగించుకుంటుంది.

 

Exit mobile version