Site icon Prime9

PM Narendra Modi : ప్రధాని మోదీ ధరించిన ఈ బ్లూ కోట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

interesting details about pm narendra modi blue coat

interesting details about pm narendra modi blue coat

PM Narendra Modi : మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

నరేంద్రమోదీ గురించి ఎంత చర్చ జరుగుతుందో ఆయన ధరించే వస్త్రాల గురించి కూడా అంతే చర్చ జరుగుతుండడం విశేషం.

మోదీ వస్త్రధారణను సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటారు.

మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయన వేషాధారణ ఎలా ఉంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంటుంది.

మార్కెట్‌లో మోదీ డ్రెస్సులకు భారీ డిమాండ్ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మోదీ కోట్లతో చాలా మంది కనిపిస్తుంటారు.

ఆయన వేసుకునే డ్రెస్సింగ్ గురించి నేషనల్ మీడియాలో కూడా చర్చ జరగడం గమనించవచ్చు.

ఇటీవల ఆయన వేసుకునే డ్రెస్సులను అప్పుడప్పుడు వేలం కూడా వేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే.. ప్రధాని మోదీ తాజాగా పార్లమెంట్ సమావేశాలకు నీలం రంగు జాకెట్ ధరించి హాజరయ్యారు.

అయితే చూడటానికి సాధారణంగానే ఉన్న.. ఆ జాకెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది.

దీంతో దేశ వ్యాప్తంగా మోదీ వేసుకున్న ఆ బ్లూ కోట్ గురించే తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

(PM Narendra Modi) ఆ కోట్ కి ఉన్న స్పెషాలిటీ  ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ జాకెట్ ను ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేయడం.

28 సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బాటిల్స్‌ని రీ సైకిల్ చేసి ఈ బ్లూ జాకెట్‌ను తయారు చేశారు.

పర్యావరణహితమైన దుస్తులను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్‍ను రూపొందించింది.

పాలీ ఇథలీన్ టెరఫ్తలేట్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఈ బ్లూ జాకెట్‍ను తయారు చేసింది.

ఫిబ్రవరి 6న బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనగా.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ సంస్థ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.

అయితే ఆ జాకెట్‌నే ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు వేసుకుని వచ్చారు.

 

ఇదిలా ఉంటే.. రాబోయే మూడు నెలల్లో ఈ బ్లూ కలర్ జాకెట్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ ఛైర్మన్ తెలిపారు.

2019లో మహాబలిపురంలో బీచ్‍లో నడుస్తూ ఆయన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరారు. ప్లాస్టిక్‍ వాడకం మంచిది కాదంటూ చాలాసార్లు సందేశం ఇచ్చారు. మరోసారి ఈ విధంగా పర్యావరణహిత సందేశాన్ని ప్రత్యేకమైన రీతిలో ఇచ్చారు మోదీ.

2046 కల్లా 10 కోట్ల పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లక్ష్యంగా పెట్టుకుంది.

మినరల్ వాటర్, కూల్‍డ్రింక్ సహా ఇతర వాటి కోసం వినియోగించే పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేసి తమ సిబ్బందికి ఎకో-ఫ్రెండ్లీ యూనిఫామ్‍లను ఇస్తామని ప్రకటించింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version