Site icon Prime9

Indore: దేశంలో క్లీన్ సిటీగా ఆరోసారి టైటిల్ గెలుకున్న ఇండోర్

Indore

Indore

Indore: కేంద్ర ప్రభుత్వ వార్షిక పరిశుభ్రత సర్వే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’ ఫలితాలు శనివారం ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వరుసగా ఆరోసారి భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల విభాగంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సర్వే ఫలితాల ప్రకారం, 100 కంటే తక్కువ పట్టణ స్థానిక సంస్థలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో, మహారాష్ట్రలోని పంచగని మొదటి స్థానంలో ఉండగా, చత్తీస్‌గఢ్‌లోని పటాన్ (NP) మరియు మహారాష్ట్రలోని కర్హాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీలో హరిద్వార్ పరిశుభ్రమైన గంగా పట్టణంగా ఎంపికైంది, వారణాసి మరియు రిషికేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అవార్డులు ప్రకటించిన వెంటనే, ప్రజలు ఇండోర్‌లో బాణసంచా పేల్చి డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో పూరీ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించి నేడు ప్రజా ఉద్యమంలా కొనసాగుతోందన్నారు. స్వచ్ఛత సర్వేక్షణ్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య సర్వే అని, 2016లో 73 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని, ఇప్పుడు 2022లో 4,355 నగరాలు ఇందులో భాగమయ్యాయని ఆయన చెప్పారు.

Exit mobile version