Site icon Prime9

Indian Wrestlers Protest : నిరసనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన భారత రెజ్లర్లు.. ఎందుకంటే?

indian wrestlers protst temporarily stopped by central minister promise

indian wrestlers protst temporarily stopped by central minister promise

Indian Wrestlers Protest : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనను చేపడుతున్నారు.

బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. ప్రతిభ కలిగిన రెజ్లర్లకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు.

వెంటనే అతన్ని డబ్ల్యూఎఫ్ఐ నుంచి తొలగించాలని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్దధర్నా చేపట్టి నిరసన తెలిపారు.

కాగా గత రెండు రోజులుగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ఇతర అధికారులు వీరితో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు.

కానీ తాజాగా జరిగిన చర్చల అనంతరం రెజ్లర్లు నిరసనకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో రెజ్లర్లతో రెండోదఫా చర్చలు జరిపారు.

సుమారు 7 గంటల పాటు ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. కాగా అనంతరం మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రెజ్లర్లతో కలిసి మాట్లాడారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే..

మానిటరింగ్ కమిటీ వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు.

ఇందులో పాల్గోనున్న వ్యక్తుల పేర్లను ఆదివారం ప్రకటిస్తామని అన్నారు.

ఈ కమిటీ తన విచారణను నాలుగు వారాల్లో పూర్తిచేస్తుందని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై వచ్చిన అన్ని ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఠాకూర్ వ్యాఖ్యానించారు.

సుమారు ఏడుగంటల పాటు రెజ్లర్లతో చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి చెప్పారు.

రెజ్లింగ్ అసోసియేషన్ పై వచ్చిన ఆరోపణల గురించి, వారి డిమాండ్లన్నింటిని విన్నాం.

రెజ్లర్ల ఆరోపణల తర్వాత డబ్ల్యూఎఫ్ఐ‌కి మేము నోటీసులు‌సైతం పంపించామని, 72 గంటల్లో సమాధానం కోరామని గుర్తు చేశారు.

ఈ చర్చల్లో భాగంగా విచారణ పూర్తయ్యే వరకు రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సంఘం రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని, విచారణకు సహకరిస్తారని కేంద్ర మంత్రి రెజ్లర్లకు హామీ ఇచ్చారు.

నాలుగు వారాల్లో కమిటీ విచారణ నివేదిక రానుందని, నివేదిక ఆధారంగా సమస్యపై ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ..

కేంద్ర క్రీడా మంత్రి తమ డిమాండ్లను విన్నారని, సరియైన విచారణ జరుగుతుందని మాకు హామీ ఇచ్చారని తెలిపారు.
తమ సమస్యలను విన్నందుకు, వాటి పరిష్కారంకు హామీ ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

న్యాయమైన విచారణ జరుగుతుందని మేము ఆశిస్తున్నామని, అందుకే విచారణ పూర్తయ్యే వరకు తమ నిరసనను విరమిస్తున్నామని తెలిపారు.

ఇటీవల ఈ వివాదం గురించి బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ..

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మహిళా రెజర్లపై వేధింపులకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.

ఇలాంటి బెదిరింపులకు నేను భయపడనని, నేను ఎన్నుకోబడిన వ్యక్తిని, ఎవరి దయతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిలో లేనని శరణ్ సింగ్ స్పష్టం చేశారు.

నేను దేశం విడిచిపోవచ్చని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

ఎవరిని నేను కలవలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు.

హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ తెలిపారు.

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version