Site icon Prime9

Basant Soren: అండర్ వేర్లు కొనడానికి ఢిల్లీ వెళ్లాను.. జార్ఖండ్‌ సీఎం సోదరుడు బసంత్ సోరెన్

Basant-Soren

Jharkhand: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్‌ సోరెన్‌ ఇటీవల ఢిల్లీ పర్యటన పై విలేకరులు ప్రశ్నించగా వారికి ఊహించని సమాధానం ఎదురయింది. నాకు లోదుస్తులు అయిపోయాయి. కాబట్టి నేను వాటిని కొనుగోలు చేయడానికి ఢిల్లీకి వెళ్లాను. నేను వాటిని అక్కడ తీసుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సోరెన్ “లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లాను” అన్న వ్యాఖ్యల పై గొడ్డ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు.పేదలు మరియు గిరిజనుల నాయకుడు శిబు సోరెన్, అంటే గురుజీ కుమారుడు, ఇప్పుడు దుమ్కా నుండి లోదుస్తులు కొనడానికి ఢిల్లీకి వచ్చారా?” అంటూ ట్వీట్ చేశారు.

సీఎం సోరెన్ పై అనర్హత వేటు వార్తల నేపధ్యంలో అధికార కూటమికి చెందిన 32 మంది ఎమ్మెల్యేలను ఆగస్టు 30న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్లారు. హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యేలు రాంచీకి తిరిగి వచ్చారు.

Exit mobile version