Site icon Prime9

Praveen Kumar : రాజ్యాంగాన్ని మారిస్తే దేశం అగ్నిగుండమే

If the constitution is changed, the country is on fire

If the constitution is changed, the country is on fire

Praveen Kumar: వ్యవస్ధల్లో నూతన వరవడిని సృష్టించాలంటే భారత రాజ్యాంగంలో అనేక సంస్కరణలు, మార్పులు అవసరమంటూ అనేక మంది రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. వారందరికి బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పు చేయలనుకోవడం సరికాదన్నారు. ఒక వేళ అలాంటిదే జరిగితే దేశం అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు.

ఎవరైనా భారత రాజ్యంగం మీద అవాకులు, చవాకులు పేలితే కబడ్డార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి భాజాపా ప్రమాదమైతే, రాష్ట్రానికి కేసీఆర్ ప్రమాదకరమని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ నేత సీతారం ఏచూరికి దమ్ముంటే తన పదవిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూర్చోబెట్టాలని డిమాండ్ చూసారు.

సీఎం కేసీఆర్ పలు కార్యక్రమాల్లో రాజ్యాంగంలోని కొన్ని చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందని పదే పదే తెలిపివున్నారు. తాజాగా ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతో పెద్ద రాజకీయ దుమారమే చెలరేగనుంది.

Exit mobile version