Site icon Prime9

Amith shah Comments: బీజేపీకి సీట్లు తగ్గితే ప్లాన్ బీ అమలు చేస్తాం.. అమిత్‌ షా

Amit Shah-plan B

Amit Shah-plan B

Amith shah Comments: భారతీయ జనతాపార్టీ అబ్‌ కీ బార్‌ 400 పార్‌ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్‌ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్‌ కీ బార్‌ 400 పార్‌ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్‌ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు. ఇదే అనుమానం మీడియాకు వచ్చింది. తాజా ఒక న్యూస్‌ ఏజెన్సీ ఒక వేళ లోకసభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న మెజారిటీ రాకపోతే ఏం చేస్తారని కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను అడిగితే.. తాపీగా ఏముంది.. ప్లాన్‌ బీ అమలు చేస్తామని ఠక్కున సమాధానం చెప్పారు. దీని గురించి ఆయన వివరణ ఇస్తూ.. ఒక వేళ ప్లాన్‌ ఏలో 60 శాతం కంటే సక్సెస్‌ రేటు తగ్గితే…. అప్పుడు ప్లాన్‌ బిని అమలు చేస్తామన్నారు.

బీజేపీకి నల్లేరు మీద నడకే..(Amith shah Comments)

లోకసభలో మొత్తం 543 మంది సభ్యులున్నారు. ఓ పార్టీకి లేదా మిత్రపక్షాలతో కలిసి మొత్తం 272 సీట్లు సాధించాలి… అంటే మొత్తం 543 సీట్లకు గాను 50 శాతం సీట్లు సాధిస్తేనే కేంద్రంలో అధికారంలో వస్తారు. 2019లో బీజేపీ స్వంతంగా 303 సీట్లు సాధించింది. నేషలన్‌ డెమోక్రాటిక్‌ అలియెన్స్‌ (ఎన్‌డీఏ) కూటమితో కలిపి 353 సీట్లు దక్కించుకుంది. తన అంచనా ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో సారి థంపింగ్‌ మెజారిటీ అధికారం చేపడతారని అమిత్‌ షా ధీమాతో చెప్పారు. దేశంలోని చాలా సర్వేలో కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు. 2024 లోకసభ ఎన్నికలు బీజేపీకి నల్లేరు మీద నడకే అని అమిత్‌ షా పేర్కొన్నారు.

దక్షిణాదిలో మెరుగైన ఫలితాలు..

దక్షిణాదిన కూడా బీజేపీ భారీ విజయం సాధిస్తుందన్నారు అమిత్‌ షా. కాగా ఇప్పటి వరకు కర్ణాటక తప్పించి మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి అంతపట్టులేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తామని చెప్పారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడులో మెరుగైన సీట్లు సాధిస్తామన్నారు. మొత్తం 23 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 379 నియోజకవర్గాల్లో మే13లో ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది మే 20, మే 25, జూన్‌1 ఎన్నికలు జరిగేవి. కాగా జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ జరుగనుంది. కాగా ఎన్‌డీఏ విజయాన్ని మోదీ ప్రధాని కాకుండా కాంగ్రెస్‌ పార్టీ కూడా మిత్ర పక్షాలతో కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడింది. మరి ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌ ఎంత వరకు అడ్డుకట్ట వేయగలతో వచ్చే నెల 4తో తేలిపోనుంది.

 

Exit mobile version