Site icon Prime9

CM Mamata Banerjee: బీజేపీ జీరో అవ్వాలని కోరుకుంటున్నాను..పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee

Mamata Banerjee

CM Mamata Banerjee: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.

బీహార్‌లో అఖిలపక్ష సమావేశం..(CM Mamata Banerjee)

అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ అందరం కలిసి ముందుకు వెళ్తాం. మాకు వ్యక్తిగత అహం లేదు, సమిష్టిగా కలిసి పని చేయాలనుకుంటున్నాం అని అన్నారు.నేను నితీష్ కుమార్‌కి ఒకే ఒక విన్నపం చేశాను. జయప్రకాష్ జీ ఉద్యమం బీహార్ నుంచి ప్రారంభమైంది. బీహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, మనం తదుపరి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. అయితే ముందుగా మనం ఐక్యంగా ఉన్నామని సందేశం ఇవ్వాలి. నాకేమీ అభ్యంతరం లేదని ముందే చెప్పాను. బీజేపీ జీరో అవ్వాలని కోరుకుంటున్నాను. మీడియా సపోర్టు, అబద్ధాలతో పెద్ద హీరోలయ్యారని ఆమె అన్నారు.నితీష్ కుమార్ మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని సన్నద్ధతపై చర్చలు జరిపాం. తర్వాత ఏం చేసినా దేశ ప్రయోజనాల దృష్ట్యానే చేస్తాము. ఇప్పుడు పాలిస్తున్న వారు చేసేదేమీ లేదు. వారు కేవలం తమ సొంత ప్రచారం చేసుకుంటున్నారు. దేశాభివృద్ధికి ఏమీ చేయడం లేదని అన్నారు.

అఖిలేష్ యాదవ్ ను కలవనున్న నితీష్ కుమార్..

2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఐక్య ప్రతిపక్షాన్ని రూపొందించే ప్రయత్నాల్లో భాగంగా నితీష్ కుమార్ మరియు తేజస్వి యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను సాయంత్రం 5 గంటలకు లక్నోలో కలవనున్నారు.ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో నితీశ్ కుమార్ భేటీ అయిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ.. వీలైనన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తామని, కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పారు.

Exit mobile version