Hockey: హకీ.. ఇప్పుడు స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతున్నా పెద్దగా ఎవరికి తెలియదు. జాతీయ క్రీడా అయినప్పటికి క్రికెట్ కు ఉన్న ఆదరణ ఈ ఆటకు లేదు. కానీ మన దేశంలో జరుగుతున్న హకీ ప్రపంచకప్ లో మన ఆటగాళ్లు ఎక్కడున్నారు.. మన స్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో కీలక దశకు చేరుకుంది. పూల్ దశలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా.. న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. ప్రపంచకప్ చేరువకు ఇండియా చేరుతుంది.
అప్పట్లో.. భారత హాకీ జట్టంటే ప్రత్యర్థి దేశాలకు వణుకు. ఒలింపిక్స్ బరిలోకి దిగితే స్వర్ణంతో తిరిగి రాని జట్టుగా భారత్ కు పేరుంది. హాకీ ప్రపంచకప్‌లోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చే జట్టుగా పేరుంది. భారత్ 1975లో విజేతగా నిలిచి చరిత్రలో నిలిచింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు సెమీస్‌కు పోలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువ సార్లు హాకీ టీమ్.. అత్యధికంగా ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది భారత్ వేదికగానే వరల్డ్ కప్ జరుగుతుంది.
దీంతో సుదీర్ఘ కలను భారత్ నెరవేర్చుకోవాలని చూస్తోంది.
పూల్ స్థాయిలో మూడు మ్యాచుల్లో విజయం సాధించి క్రాస్‌ఓవర్ మ్యాచ్‌కు ఇప్పుడు భారత్ వెళ్లింది.
ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్ అంటే ఏంటి..? ఇందులో గెలిస్తే పరిస్థితేంటి?
నాలుగు గ్రూప్‌లుగా విడిపోయిన 16 జట్లు ప్రపంచకప్ కోసం తలపడుతున్నాయి. ప్రతి పూల్ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు రేసులో ఉంటాయి.
ప్రస్తుతం క్రాస్ ఓవర్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత.. క్వార్టర్ ఫైనల్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి.
క్రాస్ ఓవర్ మ్యాచ్‌లు అనగా.. టాప్ టీమ్ మినహా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మరోక పూల్‌లోని ఇతర జట్లతో తలపడుతాయి.
ఇందులో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు అవకాశం ఉంటుంది.
గ్రూప్‌లోని టాప్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. ఈ రెండు స్థానాల్లో నిలిచిన టీముల్లో క్రాస్ ఓవర్ జట్లతో తలబడి.. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొంటారు.
ఇప్పుడు భారత్ కూడా గ్రూప్ – Dలో రెండో స్థానంలో ఉంది. గ్రూప్ – Cలో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్‌ఓవర్ మ్యాచ్ ఆడనుంది.
ముందు క్రాస్ ఓవర్‌లో గెలిస్తే..
గ్రూప్ స్టేజ్‌లో భారత్ మూడు మ్యాచుల్లో రెండు గెలిచి, ఒకటి డ్రా చేసుకొంది.
మరోసారి సమష్ఠిగా రాణిస్తే న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తే నేరుగా ఇండియా క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది. క్వార్టర్ లో బెల్జియం పటిష్టంగా ఉంది.
భారత్ బెల్జియంతో తలపడాల్సి వస్తుంది. ఆడిన మూడు మ్యాచుల్లో బెల్జియం మూడు గెలిచి.. జోష్ మీద ఉంది. బెల్జియంపై కచ్చితంగా గెలిస్తేనే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. కళింగ మైదానంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/