Gujarat: గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతలుగా డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ పేర్కొన్న మేర, డిసెంబర్ 1, 5 వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన కౌంటింగ్, ఫలితాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 4.9లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 51,782 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గడిచిన 27 సంవత్సరాలుగా భాజపా కంచుకోటగా గుజరాత్ ఉంది. మొత్తం 182 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. గతంలో భాజపా, కాంగ్రెస్ మద్య మాత్రమే బలమైన పోటీ ఉండేది. తాజాగా ఆప్ పార్టీకి కూడా కీలక పార్టీల వరుసలో చేరింది. దీంతో గుజరాత్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నిక తేదీలకు ముందే 100కి పైగా పార్టీ అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల సైయ్యాటకు సిద్ధమైనారు. సొంత రాష్ట్రంలో పట్టుకోల్పోకుండా ఉండాలన్నది ప్రధానమంత్రి మోదీ ఆలోచన. దీంతో గుజరాత్ లో మరో పర్యాయం సీఎం పీఠం దక్కించుకొనేందుకు భాజపా తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: By Elections: 6 రాష్ట్రాలు.. 7 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోలింగ్