New Delhi: దేశంలోని 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ రహదారులు రానున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో గడ్కరీ ఈ మాటలు పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడమే ప్రధానంగా చెప్పుకొచ్చారు.
బస్సులు, ట్రక్కులు రహదారుల పై సోలార్ ఎనర్జీతో పరిగెత్తేలా ఎలక్ట్రిక్ హైవేలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన్ విద్యుత్ ఆధారిత చార్జింగ్ సాంకేతికతను వినియోగించుకోవాలన్నదే ప్రభత్వ ధృడ నిశ్చయంగా తెలిపారు. టోల్ ప్లాజాల్లో సైతం సోలార్ ఎనర్జీ ఉపయోగించుకొనేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ రహదారుల పై రాకపోకలు సాగించే ఎలక్ట్రిక్ వాహనాల కొరకు ప్రత్యేక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా వాహనంలోని బ్యాటరీని చార్జ్ చేసుకొనేలా ఏర్పట్లు చేయనున్నారు. ఇందుకోసం సోలార్ ఎనర్జీని వినియోగించుకోనున్నారు.
ఇప్పటివరకు రైళ్లు మాత్రమే ప్రత్యేక పట్టాల నడుమ రవాణా సాగిస్తున్నాయి. తాజాగా చేపట్టబోయే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ రహదారులతో వాహనాలు సైతం ప్రత్యేక పట్టాలెక్కనున్నాయి. ఏయే మార్గాల్లో రహదారులు ఏర్పాటు చేయాలన్న అంశం పై కసరత్తు సాగుతుంది