Site icon Prime9

Madhya Pradesh: ఓ వృద్ధుడి పొట్టలో గ్లాసు.. నిర్ఘాంతపోయిన వైద్యులు

glass found in stomach of ealderly man in madhya pradesh

glass found in stomach of ealderly man in madhya pradesh

Madhya Pradesh: సాధారణంగా చిన్న పిల్లలే కనిపించినవన్నీ మింగేస్తుంటారు. అలా కాయిన్స్, పేపర్లు, స్పూన్లు, చిన్నపిల్లల పొట్టలో కనిపించిన సందర్భాలను చూసాము, విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా ఓ వృద్ధుడి కడుపులో ఏకంగా గ్లాస్ కనిపించింది. ఇది చూసిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌ఘర్‌ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. తీవ్ర కడుపు నొప్పితో ఓ వృద్ధుడు జిల్లా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతని పొట్టలో గ్లాసు కనిపించడం చూసి షాక్‌కు అయ్యారు. అయితే నాలుగు నెలల క్రితం అమావత్‌ గ్రామానికి వెళ్లిన రామ్‌దాస్‌ అనే వృద్ధుడిని ఏదో తప్పు చేశాడంటూ కొందరు దారుణంగా కొట్టారు. అనంతరం అతనిని ఓ గ్లాసుపై కూర్చోబెట్టారు. దీంతో గ్లాసు అతని యోని భాగం నుంచి పొట్టలోకి వెళ్లిపోయింది. గ్రామస్థులు ఈ అమానవీయ చర్యను చూసినా అతనికి ఎలాంటి సహాయం చేయలేకపోయారు. కాగా ఈ ఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నా రాందాస్‌ సిగ్గుతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే గ్లాసు కడుపులోనే ఉండడం వల్ల నొప్పి ఎక్కువ కావడంతో చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దానితో అతడిని గ్రామస్థులు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల ద్వారా పొట్టలో గ్లాసును గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:  సోషల్ మీడియా పరిచయం.. వైద్యులతో కలిసి అత్యాచారం

 

Exit mobile version