Site icon Prime9

Excise Scam Case: నెంబర్ 1 నిందితుడిగా సిసోడియా.. 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ

Excise Scam Case

Excise Scam Case

Excise Scam Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

ఆందోళనల నేపధ్యంలో కోర్టు వద్ద పోలీసులు భద్రతను భారీగా పెంచారు. ఈ కేసులో సిసోడియాను నెంబర్ 1 నిందితుడిగా పేర్కొన్నట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది.

 

రిజర్వ్ లో కోర్టు ఆర్డర్ ( Excise Scam Case)

మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది.

తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.

ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టాలని.. అందుకోసం సిసోడియాను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టను కోరింది సీబీఐ.

కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు సీబీఐ ప్రవేశపెట్టింది.

అయితే సిసోడియా విచారణకు సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు ఆరోపణలతో రిమాండ్ అడుతున్నారని తెలిపారు.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆర్డర్ ను రిజర్వ్ లో ఉంచింది.

 

ఆప్ తీవ్ర ఆందోళనలు

మరోవైపు సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట భారీ స్థాయలో ఆందోళన చేశారు.

బారిగేట్లను దాటుకుని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు.

దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న ఆప్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ ప్రభుత్వం కుట్ర పూర్వకంగానే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది.

 

ప్రతిపక్షాల మండిపాటు

కాగా, పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్‌మీడియా వేదికగా సిసోడియాకు మద్దతుగా నిలిచారు.

సిసోడియా అరెస్టు విచారకరమని.. ప్రజలకు మంచి చేసేందుకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల గళాన్ని

అణచివేసే ప్రయత్నమని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదువు, ఢిల్లీ చిన్నారుల భవితకు బీజేపీ వ్యతిరేకమనే విషయం మరోసారి రుజువైందని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ మండిపడ్డారు.

 

Exit mobile version
Skip to toolbar