Prime9

Delhi: పచ్చబొట్టు తొలగిస్తేనే ఉద్యోగ అవకాశం.. హైకోర్టు సంచలన తీర్పు

Delhi: సాధారణంగా పచ్చబొట్టు మరేమైనా ఇతర గాయాలు మచ్చలు లాంటివి ఉంటే కొన్ని ఉద్యోగాలకు అనర్హులు చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న అత్యాధుని వైద్య టెక్నాలజీతో ఎలాంటి గాయాన్నైనా, మచ్చలనైనా అంతదాకా ఎందుకు ఒకసారి పర్మినెంట్ టాటూ వేయించుకుంటే దాన్ని తీసేయ్యడం కష్టం అనుకునే వాటికిని కూడా ఇట్టే తొలగించేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలకాలంలో కేంద్ర పోలీసులు దళానికి ఎంపికై ఓ యువకుడిని పచ్చబొట్టు కారణంగా తను అర్హుడు కాదన్నారు ఉన్నతాధికారులు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ వ్యక్తి దిల్లీ హైకోర్డును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది.

సెల్యూట్‌ చేయడానికి ఉపయోగించే కుడిచేతి మీద మతపరమైన పచ్చబొట్టు ఉండటం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వైద్యపరీక్షలో తనకు ఎలాంటి లోపాలూ లేవని తేలిందనీ, చేతి మీది ఉన్న పచ్చబొట్టును చిన్నపాటి లేజర్‌ శస్త్రచికిత్సతో తొలగించుకుంటానని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు రెండు వారాల్లోపు పచ్చబొట్టు తొలగించుకొని కొత్తగా మరల ఓసారి వైద్యపరీక్షలకు బోర్డు ముందు హాజరుకావడానికి పిటిషనర్‌కు తెలుపుతూ కేసును ముగించింది. అంతేకాకుండా తాను కొత్తగా చేయించుకున్న వైద్య పరీక్షల్లో నియామకానికి అర్హుడని వైద్య బోర్డు నిర్ధరిస్తే, చట్టానికి అనుగుణంగా అతడిని రిక్రూట్‌ చేసుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి: ఏపీకి మంచి రోజులు వస్తాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version
Skip to toolbar