Site icon Prime9

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అప్రూవర్ గా దినేష్ అరోరా

Dinesh Arora

Dinesh Arora

Delhi: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి దినేష్ అరోరా ఈ కేసులో ప్రభుత్వ సాక్షిగా మారతారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు సిటీ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. వ్యాపారవేత్త దినేష్ అరోరాకు ఢిల్లీ కోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దానిని వ్యతిరేకించలేదు.

ఈ కేసులో అప్రూవర్ గా మారెందుకు అనుమతించాలని దినేష్ అరోరా కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. స్వచ్ఛందంగా తనకు తెలిసిన వాళ్ల పేర్లు చెప్తానని దినేష్ అరోరా స్పష్టం చేసారు. లిక్కర్ స్కాంలో ఉన్న పాత్ర గురించి కూడా చెబుతాను. సీబీఐకు ఇప్పటివరకు నిజమే చెప్పాను, దర్యాప్తుకు సహకరించాను కాబట్టి నన్ను అప్రూవర్ గా మారేందుకు అనుమతించాలని సిబిఐ న్యాయమూర్తి ముందు అరోరా విజ్ఞప్తి చేసారు. అప్రూవర్ గా మారే అంశం పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు 14 వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీలో మద్యం విక్రయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవినీతి ఆరోపణలు రావడంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐ విచారణకు ఆదేశించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త పాలసీని రద్దు చేసి పాత పాలసీకి మార్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం కారణంగా ఆప్ ప్రభుత్వం వేల కోట్ల విలువైన ఆదాయాన్ని కోల్పోయిందని, కొత్త విధానం ఫలితాలు చూపకముందే జరిగిందని అన్నారు.

Exit mobile version