Site icon Prime9

Online Order: ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు వచ్చిన పార్సిల్.. ఆశ కోల్పోకూడదంటున్న విక్రయదారుడు

Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి. ఏదైనా సరే ఇట్టే తయారు చేసి డెలివరీ ఇస్తారు. అయితే ఏదైనా కొంటే, సాధారణంగా దూరప్రాంతాలు అయితే ఒక వారంలో ఇంటికి డెలివరీ చేస్తారు. మహా అయితే 10 రోజులు పడుతుంది. అంతకు మించి సమయం తీసుకోరు. కానీ, ఇక్కడ ఓ వినియోగదారుడి అనుభవం వేరు. ఆర్డర్ చేసిన వస్తువు ఇంటికి చేరేందుకు నాలుగేళ్లు పట్టింది.

చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ అనే వెబ్ పోర్టల్ ఓ వినియోగదారుడి వస్తువును నాలుగేళ్ల తర్వాత అతనికి చేరవేసింది. ప్రస్తుతం మన దేశంలో ఈ అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్ నిషేధిత జాబితాలో ఉంది. దీంతో ఇది పనిచేయడం లేదు. కాకపోతే కొంత కాలం క్రితం వరకు ఇది కొనుగోళ్లకు అందుబాటులో ఉంది. ఈ పోర్టల్ చౌక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా ఉండడంతో భారత్ నుంచి దీనికి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చేవి. దీంతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఈ పోర్టల్ లో ఒక వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ చేసిన కొద్దిరోజులకే కోవిడ్ రావడం ఆ తర్వాత ఈ పోర్టల్ బ్యాన్ కావడం ఇలా అన్నీ జరిగాయి. దానితో ఎన్ని రోజులు గడిచినా పార్సిల్ డెలివరీ కాలేదు.

2019లో అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్ పై తాను ఆర్డర్ చేయగా, అది నాలుగేళ్ల తర్వాత చివరికి ఈ మధ్యకాలంలో డెలివరీ అయిందంటూ ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ వెల్లడించాడు. అంతే కాకుండా ఎవరూ ఆశని కోల్పోకూడదంటూ సందేశం ఇచ్చాడు. అలీ ఎక్స్ ప్రెస్ ను మన దేశంలో నిషేధించకముందే తాను ఈ ఆర్డర్ చేసినట్టు తెలిపాడు.

Exit mobile version