Site icon Prime9

Delhi government: ఢిల్లీలో జనవరి 1 వరకు బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం..

restrictions on fire crackers

restrictions on fire crackers

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది. తద్వారా ప్రజల ప్రాణాలను రక్షించవచ్చు” అని రాయ్ ట్వీట్ చేశారు.

ఢిల్లీలో ఈసారి ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం/డెలివరీ నిషేధించబడింది. ఈ నిషేధం జనవరి 1, 2023 వరకు అమలులో ఉంటుంది” అని ఆయన చెప్పారు. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ మరియు రెవెన్యూ శాఖతో కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని రాయ్ చెప్పారు.

సెప్టెంబర్ 28, 2021నుండి జనవరి 1, 2022 వరకుబాణాసంచా అమ్మకాలు మరియు పేల్చడం పై ఢిల్లీ ప్రభుత్వం గత సంవత్సరంపూర్తి నిషేధాన్ని విధించింది. పటాకులు కాల్చకుండా అవగాహన కల్పించేందుకు నగర ప్రభుత్వం ‘పతాఖే నహీ దియే జలావో’ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. బాణాసంచా కాల్చుతున్న వారి పై సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనలు మరియు పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు.

Exit mobile version