Site icon Prime9

Manish Sisodia: దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన సీబీఐ

manish

manish

Manish Sisodia: లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ అరెస్టుతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ.. (Manish Sisodia)

దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆదివారం విచారణకు సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌ లో మనీశ్ హాజరయ్యారు. సుమారు ఎనిమిది గంటలపాటు సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది. విచారణ అనంతరం మనిశ్ సిసోడియాను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో సిసోడియాదే కీలక పాత్రగా సీబీఐ నిర్దారించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా సిసోడియా పేరును ప్రకటించింది. లిక్కర్‌ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారని అభియోగాలను ఆయనపై నమోదు చేసింది.

బ్యూరోక్రాట్స్‌ నివేదిక ఆధారంగానే అరెస్ట్‌ చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. సిసోడియా అరెస్ట్‌ నేపథ్యంలో.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. సీబీఐ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ను విధించారు. మనీశ్‌ సిసోడియా ఆయన అరెస్ట్‌ను ఓ అధికారి ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఛార్జిషీట్‌ లో ఏడుగురు నిందితుల పేర్లను సీబీఐ పేర్కొంది. కానీ ఇందులో సిసోడియా పేరును మాత్రం చేర్చలేదు. అయినప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

గడువు కోరిన మనీశ్ సిసోడియా..

లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సీబీఐ నోటిసులు ఇచ్చిన అనంతరం తనకు వారం గడువు కావాలని పేర్కొన్నారు. దిల్లీ ర్థిక మంత్రి అయిన సిసోడియా.. బడ్జెట్‌ రూపకల్పనకు వారం గడువు కావాలని కోరారు. దీనికి సీబీఐ అనుమతించింది. ఈ లిక్కర్ స్కాంలో సిసోడియా అరెస్ట్‌ అవుతారని ముందునుంచే ప్రచారం జరిగింది. దీంతో ఆయన అరెస్ట్‌కు సిద్ధమేనంటూ ఈ ఉదయం ప్రకటించారు. మరోవైపు ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం సిసోడియాకు మద్దతుగా ఓ ట్వీట్‌ చేశారు.

దాదాపు 8 గంటలపాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. పలు సందర్భాల్లో చేసిన ఫోన్‌ కాల్స్‌ గురించి అడిగినట్లు తెలుస్తోంది. మనీశ్‌ సిసోడియా వివరణలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని ఆరోపించారు. కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతోనే అరెస్టు చేశామని అంటున్నారు. కీలకమైన సమాచారం సిసోడియా నుంచి రాబట్టాలంటే కస్టోడియల్‌ విచారణ అవసరమని అన్నారు. ఈ తరుణంలో రేపు ఆయన్ని కోర్టు ముందు హాజరు పరిచి.. సీబీఐ కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021 మద్యం పాలసీ రూపకల్పనలో.. మద్యం కంపెనీల ప్రమేయం ఉందని సీబీఐ చెబుతోంది.

Exit mobile version