Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రాత్రి ప్రజలు బాణసంచా కాల్చడంతో అది భారీ కాలుష్యానికి దారితీసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన దృశ్యాల్లో దట్టమైన పొగమంచు వీధులను చుట్టుముట్టడం, దృష్టిని తీవ్రంగా పరిమితం చేయడం కనిపించింది.
మరింత దిగజారిన గాలి నాణ్యత ..(Delhi Pollution)
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం ఢిల్లీ అంతటా గాలి నాణ్యత మరింత దిగజారింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉంది.కాలుష్యానికి సంబంధించిన మునుపటి డేటా అక్టోబర్ చివరి వారం నుండి, దేశ రాజధాని యొక్క గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉందని చూపిస్తుంది. నగరంలో PM 2.5 గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే 20 రెట్లు నమోదు చేయబడింది, దీని వలన నగర ప్రభుత్వం అన్ని ప్రాథమిక తరగతులను మూసివేయాలని మరియు ట్రక్కుల ప్రవేశాన్ని పరిమితం చేయాలని ఆదేశించింది.అక్టోబరు చివరి నుండి పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, ఎడతెగని వర్షాల తర్వాత శుక్రవారం తగ్గాయి. శని, ఆదివారాల్లో కూడా ఢిల్లీ ఆకాశం నిర్మలంగా ఉంది.అయితే దీపావళితో మరలా పరిస్దితా దిగాజారింది.
ఎయిర్ క్విలిటీ ఇండెక్స్ సున్నా మరియు 50 మధ్య ఉంటే ‘మంచిది’, 51 మరియు 100 ‘సంతృప్తికరమైనది’, 101 మరియు 200 ‘మధ్యస్థం’, 201 మరియు 300 పేలవం, 301 మరియు 400 ‘చాలా పేలవమైనది’, 401 మరియు 450 అధ్వాన్నం మరియు 450 కంటే ఎక్కువ దారుణంగా ఉన్నట్లే.