Site icon Prime9

Jignesh Mevani: దళిత శాసనసభ్యుడికి జైలు శిక్ష

Jignesh-Mevani

Ahmedabad: సమాచారం మేరకు, దళిత నేత, స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ 2016లో గుజరాత్ యూనివర్శిటీ లా భవన్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు మార్చాలని నిరసన చేపట్టారు. దీనిపై కేసు నమోదైవుంది. వాదోపవాదాల అనంతరం జిగ్నేష్ మేవానీతో పాటు మరో 18 మందికి అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

మరో కేసులో కూడా జిగ్నేష్ కు కోర్టు శిక్షను విధించింది. గుజరాత్‌లోని మెహసానాలోని మెజిస్టీరియల్ కోర్టు అనుమతి లేకుండా ఆజాదీ మార్చ్ నిర్వహించి వున్నారు. ఆ కేసులో మేవానీ తో పాటు తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించి న్యాయస్ధానం వారికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.

జూలై 2017లో చట్టవిరుద్ధమైన సమావేశానికి పాల్పడినందుకు మేవానీతోపాటు ఎన్‌సిపి కార్యకర్త రేష్మా పటేల్, మేవానీకి చెందిన రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ సభ్యులతో సహా మరో తొమ్మిది మందిని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దోషులుగా నిర్ధారించారు. మొత్తం 10 మంది దోషులకు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానాను కూడా కోర్టు విధించింది.

పాటిదార్ కమ్యూనిటీకి రిజర్వేషన్ కోసం మద్దతు ఇచ్చిన రేష్మా పటేల్ మార్చ్‌లో పాల్గొన్నప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడు కాదు. అయితే ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో మేవానీ శిక్షపై కోర్టు స్టే విధించింది.

Exit mobile version