Site icon Prime9

Goa Congress Crisis: గోవా కాంగ్రెస్‌ పార్టీలో ముసలం 11 మంది సభ్యుల్లో ఆరుగురు బీజేపీలోకి జంప్‌?

Goa: గోవా కాంగ్రెస్‌ నిట్ట నిలువునా చీలిపోయింది. 40 మంది గోవా శాసనసభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 11 మంది. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మిగలగా, ఆరు మంది బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతుండం పట్ల కాంగ్రెస్‌ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆదివారం అంతా గోవా కాంగ్రెస్‌లో హై డ్రామా జరిగింది. కాంగ్రెస్‌ అసంతృప్తి వర్గం నేరుగా పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించింది. మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటే కనీసం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే బీజేపీ వైపు మొగ్గచూపుతున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ చూపించాలి.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ గోవా సంక్షోభాన్ని నివారించేందుకు కాంగ్రెస్‌ రాజ్యసభ్యుడు ముకుల్‌ వాస్నిక్‌ను గోవా పంపించారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారమని దేవాలయాలు, చర్చిల్లో ప్రమాణాలు చేశారు. అఫిడవిట్‌ల పై సంతకాలు కూడా చేశారు. ఇదిలా ఉండగా గోవా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి దినేష్‌ గుండూరావు, కామత్‌ గ్రూపునకు చెందిన మైఖేల్‌ లోబోను ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదా నుంచి తొలగిస్తామని ప్రకటించారు. వ్యక్తిగత లాభాల కోసం పార్టీని వీడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.

ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది వారి అంతర్గత విషయమని, కావాలనే బీజేపీపై బురద జల్లుతోందని కాంగ్రెస్‌పై విమర్శలు గప్పించింది.

 

Exit mobile version