Site icon Prime9

Uttar Pradesh: ఎంత ఘోరం.. ఛాయ్ తాగి ఐదుగురు మృతి

tea prime9news

tea prime9news

UP Crime news: యూపీలోని మెయిన్‌పురిలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో చేసిన టీ తాగి ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన నాగ్లా కన్హై గ్రామంలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కమలేశ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.

ఎస్పీ కమలేశ్‌ దీక్షిత్‌ తెలిపిన వివరాలు ప్రకారం, నాగ్లా కన్హై గ్రామంలోని శివానందన్ (35), అతని కుమారులు శివంగ్ (6), దివ్యాంష్ (5), అతని బావ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ (45)తో కలిసి ఇంట్లో టీ చేసుకొని తాగారు. టీ తాగిన వెంటనే ఈ ఐదుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చుట్టు పక్కల వారు వీరందరినీ చూసి జిల్లా హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే రవీంద్ర సింగ్,  శివాంగ్, దివ్యాన్ష్‌ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. సోబ్రాన్‌, శివానందన్‌ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంటే మెరుగైన వైద్యం కోసం సైఫాయి ఆస్పత్రికి తరలించారు. వీరు కూడా మృతి చెందారు.

స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు. టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తే శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు పొలాలకు వాడే పిచికారీ మందును కలిపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Exit mobile version