Site icon Prime9

బెళగావి: కర్ణాటక అసెంబ్లీలో వీర్ సావర్కర్ ఫొటో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివాదం.. ఎందుకో తెలుసా..?

savarkar

savarkar

Belagavi: సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు.రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు బెళగావిలోని సువర్ణ విధాన సౌధలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వీర్ సావర్కర్ చిత్రపటాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ బయట మెట్లమీద కూర్చుని నిరసనకు దిగారు.

ఇలాంటి చర్యల ద్వారా అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్యే డీకే శివకుమార్ ఆరోపించారు. అసెంబ్లీ కార్యక్రమాలు జరగకూడదని వారు కోరుకుంటున్నారు. దానికి అంతరాయం కలిగించాలని వారు కోరుకుంటున్నారు. మేము వారిపై చాలా అవినీతి అంశాలను లేవనెత్తుతాము కాబట్టి వారు ఈ ఫోటోను తీసుకువచ్చారు. వారికి ఎటువంటి అభివృద్ధి అజెండా లేదు అని శివకుమార్ అన్నారు.మరోవైపు ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ మండిపడింది. సైద్ధాంతిక విభేదాలు ఉండాలి కానీ సావర్కర్ స్వాతంత్ర్య సమరయోధుడు, దావూద్ ఇబ్రహీం పోస్టర్ ఎవరిని పెట్టాలి అని సిద్ధరామయ్యను అడగండి అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఢిల్లీలో అన్నారు.

సావర్కర్ పై కాంగ్రెస్ అభ్యంతరాలేమిటి?

స్వతంత్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ మరియు హిందూ మహాసభల పాత్రలేదు కాబట్టి బిజెపి తమ సభ్యులలో ఒకరు హీరోలా నిలబడాలని కోరుకుంటుంది. అందుకే వారు సావర్కర్‌ను ఉద్దేశించి మాట్లాడుతుంటారని కాంగ్రెస్ తరచూ చెబుతూ ఉంటుంది. సావర్కర్ 11 సార్లు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పిన వ్యక్తని తొమ్మిది సార్లు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. అంతేకాదు రెండేళ్లకిందట కాంగ్రస్ సేవాదళ్ విడుదల చేసిన పుస్తకంలో అతడిని హోమో సెక్సువల్ గా అభివర్ణించింది.

Exit mobile version