Site icon Prime9

Kamal Nath: వివాదాస్పదంగా కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ బర్త్ డే.. హనుమంతుని ఫోటోతో ఆలయ ఆకారంలో కేక్

cake

cake

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్‌ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటం పై వివాదం చెలరేగింది.ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని “హిందువులను అవమానించడంగా అభివర్ణించారు.

కమల్‌నాథ్‌ తన స్వస్థలమైన చింద్వారాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా, అతని మద్దతుదారులు నవంబర్ 18 న వచ్చే అతని పుట్టినరోజును ముందుగానే జరుపుకున్నారు. మంగళవారం సాయంత్రం చింద్వారాలోని మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

దీనిపై బుధవారం బీజేపీ కార్యాలయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ రామాలయానికి వ్యతిరేకం. ఇప్పుడు ఓట్ల కోసమే హనుమాన్‌జీని గుర్తుపెట్టుకుంటారు. కేక్‌పై హనుమాన్‌ చిత్రపటాన్ని ఉంచి కట్‌ చేశారు. ఇది హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.

 

Exit mobile version