Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మెట్రో పిల్లర్ రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి హరిహారం అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. మరో వైపు బెంగళూరు మెట్రో సైతం బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని అందిస్తామని తెలిపింది.
ఈ ఘటనపై ఈ రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డికే శివకుమార్ అన్నారు. 40% కమీషన్ ప్రభుత్వ తీసుకోవడం వల్లే ఈ ఫలితం అని ఆయన అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారని.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.
నిర్మాణంలో ఉన్న పిల్లర్ మహిళ, చిన్నారిపై పడిపోవడం షాకింగ్ ఘటన అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి అన్నారు. ఇది బిజెపి ప్రభుత్వ ఉల్లంఘన, నిర్లక్ష్యం అవినీతికి నిదర్శనమని ఆమె అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. నిర్మాణంలో ఉన్నది కూలితేనే.. నిర్మించాకా వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
#NammaMetro Construction Piller Collapsed Near Hennuru…
So Far No Casualty's #Bengaluru #Metro #BMRCL pic.twitter.com/Bs0YkltjZf— Manjunath s (@Manjuna70098788) January 10, 2023
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/