Site icon Prime9

MP Tejasvi Surya: బెంగళూరు సౌత్ ఎంపీకి దోసె కష్టాలు..

Mp Thejasvi

Bengaluru: ఓవైపు అతాకుతలం. మరో వైపు హ్యపీ ఈటింగ్. ఇంకేముంది ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం వెల్లుబికింది. అంతే సోషల్ మీడియా వేదికగా అందుకు కారణమైన వ్యవహారం పై నెటిజన్లు దుమ్ము దులిపేసారు. ఆ ఘటనలో అడ్డంగా బుక్కైన ఆ పార్లమెంటు సభ్యుడుని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన కన్నడనాట చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్లితే గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెంగళూరు నగరం వరదతో బురదగా బురదగా మారింది. నగరంలోని పలు కీలక ప్రాంతాలతోపాటుగా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. సామాన్యుడి దగ్గర నుండి బడా బాబులు వరకు తమ సొంత వాహనాలను వదిలి ప్రొక్లయన్లు, ట్రాక్టర్ల సాయంతో వీదులు దాటారు. బీద, బిక్కి, గొప్ప అనే తారతమ్మాలు లేకుండా బతుకు జీవుడా అనుకొంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరీ కొన్ని ప్రాంతాల ప్రజలు వర్షాలకు భయపడిపోయారు. ఆ దృశ్యాలన్నీ ప్రపంచానికి కళ్లకు కడుతున్నాయి.

వరదలు, విపత్తుల సమయంలో ప్రభుత్వాల పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన బెంగళూరు దక్షిణ పార్లమెంటు సభ్యులు తేజస్వీ సూర్య చర్యతో ప్రజలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఎంపి తేజస్వీ తన ఇన్ స్టాగ్రాంలో చూసి పద్మనాభ నగర్ లోని ఓ హోటల్ కు వచ్చాను. ఇక్కడ వెన్న దోసె, ఉప్మా చాలా టేస్ట్ గా ఉందంటూ మీరు కూడ రుచిచూడండి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేసాడు. దీంతో స్థానికులు, రాజకీయ వర్గాలు, ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ తేజస్వీ పై మండిపడ్డారు.
ఓ వైపు ఇండ్లోకి చేరిన వరద నీటితో జీవితాలు అతాకుతలం అయ్యాయని మేము బాధపడుతుంటే, మీకు దోసెలు ముఖ్యంగా మారాయా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆయన్ను తుర్పూరాపట్టారు.

మరో వైపు కీలక రాజకీయ నేతలు సైతం ఎంపీ ప్రవర్తనపై విరుచుకపడ్డారు. ఓవైపు భారీ వర్షాలతో ప్రజలు సతమతమవుతుంటే మీరు చేసిన దోసెల ప్రచారం సరైందా అంటూ ఎంపీ నిలదీసారు. హోటళ్లను ప్రమోట్ చేయాలంటే అందరం ఔటర్ రింగ్ రోడ్డులో కలుద్దాం. అక్కడ బెంగళూరు సౌత్ ఓటర్లు ఉన్నారు అంటూ హేళన చేసారు. ప్రముఖులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ తేజస్వీ పర్యటించారా? అంటూ ప్రశ్నించారు. బెంగళూరు వాసులు భారీ వరదలతో అల్లాడుతుంటే తేజస్వీ తీరు సరిలేదని, వరదలతో అల్లాడుతున్న ఘటన రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన్నట్లు ఉందంటూ మండపడ్డారు. తేజస్వీ బిజెపి ఎంపీ కావడంతో ఈ వ్యవహారంలో ఆ పార్టీ మౌనంగా ఉండిపోయింది.

Exit mobile version