Site icon Prime9

CM Arvind Kejriwal: కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్ళ మూసివేత: సీఎం కెజ్రీవాల్

CM Kejriwal said that primary schools are being closed in Delhi due to pollution

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనింది. రేపటి నుండి ప్రైమరీ సూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంతవరకు ఈ మూసివేత ఉంటుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా 5 ఆపై తరగతుల విద్యార్ధుల అవుట్ డోర్ గేమ్స్ ను కూడా నిలిపివేస్తున్నట్లు సీఎం తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సరి-బేసి వాహనాలతో రాకపోకలను అమలు చేయడం గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్ధాలను పెద్ద ఎత్తున తగలబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. పంజాబ్ రాష్ట్రంలో కూడా వ్యర్ధాల దహనం ఎక్కవగా ఉండడంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాల పై విమర్శలు సంధిస్తున్నారు. దీని పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వాయి కాలుష్యం అనేది ఉత్తర భారతదేశాన్ని పీడిస్తున్న సమస్యగా చెప్పారు. కాలుష్యానికి ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు కారణం కాదన్నారు. నిందలు వేసే సమయం కాదని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ లో వ్యర్ధాల దహనాల కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు సీఎంలు పేర్కొన్నారు. ఏడాది సమయంలోపు వ్యర్ధాల సమస్య పై మేం ఆలోచనలు చేస్తామంటూ పేర్కొన్నారు.

దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటోంది. నేటి ఉదయం ఢిల్లీలోని గాలి నాణ్యత సూచీ 450 కంటే పైగా నమోదైంది. ఇది అత్యంత తీవ్ర స్థాయిని చూపిస్తుందని అధికారులు పేర్కొన్నారు. బవానా ప్రాంతంలో 483 గా నమోదవడం గమనార్హం. కాలుష్యాన్ని అరికట్టేందుకు నిర్మాణ పనుల పై నిషేదం విధించారు. నొయిడాలోనూ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఈ నెల 8వరకు స్కూళ్లు మూసివేసి ఆన్ లైన్ క్లాసులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

ఇది కూడా చదవండి: Tamilisai Soundararajan: గవర్నర్ రాజీనామా కోరడం.. భావ స్వేచ్చను హరించడమే.. తమిళసై

Exit mobile version