Site icon Prime9

Jharkhand: ఇకపై పెళ్లిళ్లలో డ్యాన్సులు చెయ్యడం మ్యూజిక్ పెట్టడం నిషేధం

Clerics ban dance, music, fireworks in Muslim weddings in Jharkhand

Clerics ban dance, music, fireworks in Muslim weddings in Jharkhand

Jharkhand: ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాధ్ జిల్లాలో ఉన్న ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం నిఖా అనగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చెయ్యడం, పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టడాన్ని నేరంగా పరిగణిస్తూ వాటిపై నిషేధం విధించారు. ఇకపై వివాహాల్లో డ్యాన్సులు చేయడం, పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టడం, బాణసంచా కాల్చడం వంటి చర్యలు చేస్తే జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

నిర్సా బ్లాక్‌లోని సిబిలిమడీ జామా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇస్లాం మత విధానానికి అనుగుణంగా వివాహాలు జరగాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు. అంతే కాకుండా రాత్రి 11 గంటల తర్వాత వివాహం జరిపించినా జరిమానా తప్పదన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై రూ. 5,100 జరిమానా విధిస్తామన్నారు. ఇస్లాంలో ఇలాంటి వాటికి తావులేదన్నారు. అంతేకాదు, ఇది ప్రజలకు అసౌకర్యంగానూ ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు

Exit mobile version