Site icon Prime9

MP Raghurama Raju: కోర్టు తీర్పును సీఐడీ అధికారులు ఉల్లంఘించారు

CID officials have violated the court order

CID officials have violated the court order

New Delhi: కట్టేసి కొట్టిన ఘటనలో తనను వర్చువల్ విధానంలో విచారణ జరపాలని పేర్కొన్న కోర్టు ఉత్తర్వులను సైతం ఏపీ సీఐడి అధికారులు ఉల్లంఘిస్తున్నారని పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణం రాజు మీడియాతో పేర్కొన్నారు. సీఐడి విచారణకు తాను రాలేదని కోర్టుకు తెలిపిన నేపధ్యంలో ఎంపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని తన న్యాయవాది స్పష్టంగా తెలియచేసారని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వ తీరుపై మరోమారు రఘరామ ఫైర్ అయ్యారు. 6లక్షల ఉద్యోగాలని చెప్పిన జగన్, నేడు నిరుద్యోగులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పిట్టలదొరగా సీఎం జగన్ ను ప్రజలు భావిస్తున్నారని రఘురామ చమత్కరంగా తెలిపారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిని శాసనసభ నుండి గెంటేయడానికి గుడ్ స్పీకర్ ఉన్నాడని వ్యంగంగా అన్నారు. పోలీసులు, టీచర్ల నియామకాలెక్కడని జగన్ ను నిలదీసారు. చంద్రబాబు హాయంలో వచ్చిన పరిశ్రమలు కీయా, అపోలో టైర్స్ గా పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో గడిచిన 42 నెలలుగా ఫైనాన్స్ కమీషన్ లేదన్నారు. రాజధానిపై జగన్ మాట్లాడిన చిలుక పలుకులు  మరిచి మూడు రాజధానుల నిర్ణయం ఎంతవరకు సబబో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కూడా కట్టుకొన్నట్లు తెగ ప్రచారం చేసిన సంగతి మరిచారా అంటూ నాటి జగన్ మాటలను ఎంపీ గుర్తు చేసారు.

మొత్తం మీద కోర్టు చీవాట్లతో మారుతారని ఊహించిన సీఐడి అధికారులు సైతం యధా రాజ, తధా ప్రజా అన్న మాటున ఉండడాన్ని ప్రజలు మౌనంగా గమనిస్తున్నారు. సర్వోత్తమ న్యాయస్ధానం ఎన్నో పర్యాయాలు ఏపీ ప్రభుత్వ విధానాలను చెక్ పెట్టిన్నప్పటికీ పరిపాలనలో మార్పు రాకపోవడం పట్ల ప్రజలు ఊసూరుమంటున్నారు.

Exit mobile version