Site icon Prime9

Chhattisgarh Road Accident: పెళ్లికని వెళ్లి రోడ్డుప్రమాదం పాలై.. 11 మంది స్పాట్ డెడ్

Chhattisgarh Road Accident

Chhattisgarh Road Accident

Chhattisgarh Road Accident: పెళ్లికని బయలుదేరారు. బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కుటుంబమంతా సంతోషంతో కారులో బయలుదేరారు. సందడి సందడిగా శుభకార్యానికి వెళ్తున్నామనే జోష్ తో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. వీరి సంతోషంపై కాలం కన్నెర్ర చేసింది. వీరి సరాదా ప్రయాణం కాస్త విషాదాంతంగా మారింది. పెళ్లి ప్రయాణం కాస్త మృత్యు ఒడికి చేరింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే 11 నిండు ప్రాణాలు పోయాయి. రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలోని 11 మందిని బలితీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఊహించని ప్రమాదం.. ఊపిరి తీసేసింది(Chhattisgarh Road Accident)

ధామ్‌తరి జిల్లాలోని సోరం-భట్‌గావ్ గ్రామం నుంచి కాంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా బాధితుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన జాతీయ రహదారి-30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్తారా గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిందని పోలీసులు వివరించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఎస్‌యూవీలో ఉన్న వారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలతో ఉన్న ఒక చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాద ఘటనపై ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సాభూతి తెలిపారు.

 

Exit mobile version