Mumbai: మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది. ఏక్ నాధ్ షిండే కేవలం భాజపా చేసిన తాత్కాలిక ప్రభుత్వంగా పేర్కొంటూ త్వరలో 22 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నట్లు పత్రిక పేర్కొనింది.
పత్రికలో ప్రచురించిన రోక్ ఠోక్ వ్యాసంలో, ఏక్‌నాథ్ షిండే ధరించిన ముఖ్యమంత్రి యూనిఫాంను ఇక ఎప్పుడైనా తొలగిస్తారని అందరూ అర్థం చేసుకున్నారని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పేర్కొంది. తూర్పు అంధేరీ ఉప ఎన్నికల్లో షిండే శిబిరం తన అభ్యర్థిని నిలిపి ఉండకపోవడం పట్ల భాజపా హస్తముందన్నారు. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే శిబిరం చెప్తోందని, అందులో వాస్తవం లేదని తెలిపింది.
నిజానికి సుమారు 22 మంది ఎమ్మెల్యేలు షిండేపై అసంతృప్తిగా ఉన్నారని, వీరిలో అత్యధికులు బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పింది. షిండే తనకు తానే తీరని నష్టం చేసుకున్నారని, అదే విధంగా మహారాష్ట్రను కూడా నష్టపరిచారని పేర్కొంది. రాష్ట్రం ఆయనను క్షమించదని స్పష్టం చేసింది. బీజేపీ తన ప్రయోజనాల కోసం షిండేను వాడుకొంటుందని పేర్కొనింది. షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని భాజపా నేత చెప్పారని పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, వాటిని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటిస్తున్నారని పేర్కొంది. ఈ కథనంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజేసినట్లైయింది.
ఇది కూడా చదవండి:Minister Somanna: మహిళను చెంప చెళ్లుమనిపించిన కర్ణాటక మంత్రి