Site icon Prime9

BJP MP Janardan Mishra: టాయిలెట్ ను చేతులతో శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ

BJP MP

BJP MP

Madhya Pradesh: బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మధ్యప్రదేశ్‌ రేవా జిల్లాలోని బాలికల పాఠశాలలో మురికిగా ఉన్న మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేస్తున్న వీడియో ఎంపీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. బాలికల పాఠశాలలో టాయిటెట్ ను వట్టి చేతులతోనే ఎంపీ మిశ్రా శుభ్రం చేయడం గమనార్హం.

యువమోర్చా సేవా పఖ్‌వాడా ప్రచారంలో భాగంగా బీజేపీ యువజన విభాగం సభ్యులు ఖత్ఖారీ బాలికల పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారని ఎంపీ జనార్దన్ మిశ్రా వీడియోను పంచుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పాఠశాలలను సందర్శించినప్పుడు మురికిగా ఉన్న మరుగుదొడ్డిని గమనించి, తన ఒట్టి చేతులతో తానే దానిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. నేను పాఠశాలను సందర్శించినప్పుడు టాయిలెట్ మురికిగా ఉందని గుర్తించాను. కాబట్టి, నేను దానిని శుభ్రం చేసాను. ఇది పెద్ద విషయం కాదని మిశ్రా తెలిపారు.

Exit mobile version