BJP Central Cabinet Expansion: బీజేపీ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆలోగా జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలతో భాజపా మిగతా రాష్ట్రాల్లో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. కేంద్ర కేబినెట్, బీజేపీలో సరికొత్త మార్పులు జరగనున్నాయి. మరో రెండు వారాల్లోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో భాజపా ముఖ్య నేతలంతా సమావేశమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని కోసం జూన్ 28, 2023 బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియమాకం వంటి పలు కీలక అంశాలను చర్చించినట్లుగా సమాచారం.
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని సర్వేలు ప్రజల నాడిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో కీలక మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ లకు కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అలాగే గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు పలు రాష్ట్రాలకు కూడా బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుల్ని నియమించనున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందో లేదో మా నడ్డాను అడిగి చెబుతాను అంటూ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సెటైర్లు వేశారు. అధ్యక్షుడి మార్పు మీడియా సృష్టేనంటూ అంటూ ఆయన కొట్టిపారేశారు. లీకులు ఎక్కడి నుండి వస్తున్నాయో మాకు సమాచారం ఉందని.. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. లీకులకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే అంటూ బండి సంజయ్ ఆరోపించారు.