Site icon Prime9

Anurag Thakur: రెజ్లర్ల ఆందోళన.. మరోసారి చర్చలకు ఆహ్వానించిన అనురాగ్ ఠాగూర్

Anurag Thakur

Anurag Thakur

Anurag Thakur: లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత విధుల్లో చేరారు. అయితే ఆందోళన మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ ట్విటర్ లో తెలిపారు. ‘రెజ్లర్ల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయంపై వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించాను’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

 

అమిత్ షా భేటి తర్వాత కీలక పరిణామాలు(Anurag Thakur)

కాగా, గత శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రెజ్లర్లతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి పలు కీలక పరిణామాలు జిరగాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తిరిగి విధుల్లో చేరారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు.

అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా మాట్లాడుతూ.. తాము కేంద్రమంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపారు. ‘ఈ ఉద్యమం ఆగదు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించలేదు. ప్రభుత్వ స్పందనతో మేం సంతృప్తిగా లేము’ అని పునియా వెల్లడించారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Exit mobile version