Site icon Prime9

Amit Shah Comments: కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఫేక్ ఫైట్ .. అమిత్ షా

Amit Shah

Amit Shah

Amit Shah Comments:కేరళలో అలప్పుజ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భారీ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న పోటీ వట్టి బూటమని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఒక స్టేజీపైకి వచ్చి చేయి చేయి కలుపుతారు. అదే కేరళకు బెంగాల్‌కు వచ్చే సరికి బద్ధశత్రులుగా ఫోజు కొడతారు. వారి ఫైట్‌ ఫేక్‌..కాంగ్రెస్‌ — కమ్యూనిస్టుల మధ్య ‘ఇలు- ఇలు” జరుగుతోందని ఎద్దేవా చేశారు అమిత్‌ షా.

స్కాముల్లో సీఎం కుటుంబం..(Amit Shah Comments)

కేరళలో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకటి కమ్యూనిస్టులు, రెండో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, మూడోది ఎన్‌డీఏ అని షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఆనవాళ్లు లేకుండా పోయారు. మన దేశంలో కూడా కనుమరుగయ్యారు. కాంగ్రెస్‌ ఒక్కటే మిణుకు మిణుకు మంటోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే పీఎఫ్‌ఐని నిషేధించాలా వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు పీఎఫ్‌ఐ మద్దతు తీసుకున్నాయని అమిత్‌ షా విమర్శించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ స్కాంల గురించి ప్రస్తావించారు. మైనింగ్‌ స్కాంలో కాంగ్రెస్‌ పాత్ర ఉంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకులు ఇక్కడ బ్లాక్‌శాండ్‌ దోచేశారు. సీఎం కుటుంబమే పలు స్కామ్‌లలో ఇరుక్కొని సతమతం అవుతోంది. అయినా కమ్యూనిస్టు పార్టీ మాత్రం సీఎం గురించి పల్లెత్తుమాట కూడా అనదని అమిత్‌ సార్యాలీని ఉద్దేశించి ఇటు కాంగ్రెస్‌, అటు కమ్యూనిస్టులపై విమర్శలు వర్షం గుప్పించారు.

నరేంద్రమోదీ మూడో సారి ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ర్టంలో హింసకు తావు లేకుండా చేస్తారని షా హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల తర్వాత ఇండియాను వ్యవసాయం, టెక్నాలజీ, తయారీరంగంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని అమిత్‌ షా అన్నారు. కాగా సర్వేలన్నీ ప్రధాని మోదీతో కలిసి నడవడానికి ఉన్నాయన్నారు అమిత్‌ షా. కేరళ రైతులతో పాటు మత్యకారులు కూడా మోదీతో నడవడానికి సిద్దంగా ఉన్నారని షా పేర్కొన్నారు. కాగా కేరళలోని 20 లోకసభ స్థానాలకు ఒకే రోజు ఈ నెల 26న పోలింగ్‌ జరుగనుంది. ఫలితాలు జూన్‌ నాలుగున వెలువడనున్నాయి. కాగా రెండవ విడత పోలింగ్‌ ప్రచారం బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. 13 రాష్ర్టాల్లో మొత్తం 89 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగనుంది. అయితే 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీ కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈ సారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాది రాష్ర్టాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. కేరళలో బీజేపీ కనీసం మూడు సీట్లు గెలుస్తుందని అంచనా.. మరి ఫలితాలు తెలవాలంటే జూన్‌ 4 వరకు ఆగాల్సిందే.

 

Exit mobile version