Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై సమాజ్‌వాదీ పార్టీ ఆఫీస్ బేరర్ మనీష్ జగన్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. అగర్వాల్ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల గుమిగూడారు.
టీ తాగనని..
ఈ సందర్బంగా అఖిలేష్ యాదవ్ అక్కడికి వచ్చినపుడు అతనికి టీ ఇవ్వగా తాగడానికి నిరాకరించారు. నేను ఈ ప్రదేశంలోని టీ తాగను. బయట నుంచి తెప్పించిన టీ తాగుతాను. ఒకవేళ ఇందులో విషం కలిపితే ఎలా ఉంటుంది? ఇక్కడ ఏదైనా టీ దుకాణం తెరిచి ఉందో లేదో చూడమని అనుచరులకు సూచించారు. తాను అక్కడికి వెళ్లినప్పుడు పోలీసు హెడ్‌క్వార్టర్‌లో సీనియర్ ఎవరూ లేరని కూడా చెప్పారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వినడానికి ఎవరూ లేకుంటే, మిగిలిన యూపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండని మీడియాతో అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డిజి ప్రశాంత్ కుమార్ దీనిపై స్పందించారు. ఆదివారం కావడంతో అధికారులు తక్కువమంది ఉన్నారని అన్నారు. అఖిలేష్ యాదవ్ వారితో మాట్లాడారు. తరువాత, ఇక్కడ ఉన్న అధికారులు అతనికి టీ ఇస్తే తాగారని అన్నారు.
అతన్ని కలసేందుకే..
లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత, మనీష్ అగర్వాల్‌ను కలిసేందుకు అఖిలేష్ యాదవ్ గోసాయిగంజ్ జిల్లా జైలుకు చేరుకున్నారు. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మనీష్ జగన్ అగర్వాల్‌పై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదైన తర్వాత లక్నో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మనీష్ జగన్ అగర్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందినవారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన జగన్నాథ్ ప్రసాద్ అగర్వాల్ కుటుంబ సభ్యుడినని ఆయన పేర్కొన్నారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో జగన్నాథ్ ప్రసాద్ కూడా రాజ్యసభ సభ్యుడు.
ఇవి కూడా చదవండి:
Virat kohli: ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్
Shaakunthalam Trailer: ‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత
Dil Raju: నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/