Site icon Prime9

Ajay Maken: రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ పదవికి రాజీనామా చేసిన అజయ్ మాకెన్

Ajay Maken

Ajay Maken

Ajay Maken: కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ బుధవారం పార్టీ రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌ పదవికి రాజీనామా చేశారు.తాను రాజస్థాన్ ఇన్‌చార్జిగా కొనసాగేందుకు ఇష్టపడటం లేదని మాకెన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నవంబర్ 8న ఒక పేజీ లేఖ రాశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం పదవిని వదులుకోవడానికి నిరాకరించడంతో జరిగిన పరిణామాలపై మాకెన్ అసంతృప్తి వ్యక్తం చేసారు.

పార్టీ కీలక సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించిన గెహ్లాట్‌కు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలపై పార్టీ ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో మాకెన్ అసంతృప్తి చెందారు. వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌కు వస్తున్నందున, వీలైనంత త్వరగా కొత్త ఇన్‌చార్జిని నియమించడం అత్యవసరం” అని మాకెన్ తన లేఖలో పేర్కొన్నారు.గత మూడు తరాలుగా కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించానని అన్నారు. 40 ఏళ్లకు పైగా క్రియాశీల కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నందున, నేను రాహుల్ జీకి ఎప్పుడూ గొప్ప అనుచరుడిగా ఉంటాను, ఆయనను నేను విశ్వసిస్తున్నాను.మాటలకు అతీతంగా నమ్ముతానని మాకెన్ అన్నారు.

 

Exit mobile version