Site icon Prime9

Assam-Meghalaya Boarder: అసోం-మేఘాలయ సరిహద్దుల్లో కాల్పులు.. ఆరుగురు మృతి

6-killed-in-assam-and-meghalaya-border-firing

6-killed-in-assam-and-meghalaya-border-firing

Assam-Meghalaya Boarder: అసోం-మేఘాలయ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు మృతి చెందారు. కలప స్మగ్లింగ్ చేస్తుడడంతో ఈ కాల్పులు జరిగాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్రో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అసోం అటవీ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నంలో కాల్పులు జరుపగా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు మేఘాలయకు చెందిన వారు కాగా, ఒకరు అసోం ఫారెస్ట్ గార్డ్ గా మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ధ్రువీకరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా, అసోం-మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇందులో 12 వివాదాస్పద ప్రాంతాలున్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా మధ్య గత మార్చిలో అవగాహన ఒప్పందం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చర్చలు జరుగుతుండగా అంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పొరుగు రాష్ట్రాల మధ్య మరోమారు ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

ఇదీ చదవండి: కర్మకాండలకూ ఓ స్టార్టప్.. ఇదేం కర్మరా అంటున్న నెటిజన్లు

Exit mobile version