Site icon Prime9

Bandi Sanjay comments:కేసీఆర్ గడీని బద్దలు కొడతాం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay comments

Bandi Sanjay comments

Bandi Sanjay comments:కేసీఆర్ బెంగాల్ తరహా పాలన కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాషాయ రాజ్యం రాబోతోంది. కేసీఆర్ నీ గడీని బద్దలు కొడతాం అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ములుగులో నిర్వహించిన బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ బిడ్డను కాపాడటానికి యంత్రాంగం అంతా ఢిల్లీ పోయింది. పేపర్ లీక్ వల్ల 30 లక్షలమంది బాధపడుతుంటే కేసీఆర్ మాట్లాడలేదు. ఆయనకు మోచేతి నీళ్లు తాగే మంత్రులు, నేతలకు నిరుద్యోగుల బాధలు అవసరంలేదు. పేపర్ లీక్ పై బీజేపీ యుద్దం ప్రకటించింది. కేసీఆర్ కొడుకును భర్తరఫ్ చేయాలి. అలా చేయకపోతే కేటీఆర్ ను తెలంగాణ యువత బయటకు నెట్టడం ఖాయం. బీజేపీ ఏ వర్గానికి. మతానికి కొమ్ము కాయలేదని బండి సంజయ్ అన్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచులో పాకిస్తాన్ గెలిచితే సంబరాలు చేసుకునే వారికి మద్దుతు పార్టీలను గెలిపించవద్దు. 16 నిమషాలు సమయమిస్తే నరుకుతానన్నారు. భరిద్దామా అంటూ ప్రశ్నించారు.

పాతబస్తీని కొత్త బస్తీగా చేస్తాము..(Bandi Sanjay comments)

బీజేపీ కార్యకర్తలకు పోలీసుకేసులు, జైలు శిక్షలు కొత్త కాదు. ఒవైసీ అనే మూర్ఖుడు విసిరిన సవాల్ కు కేసీఆర్ అన్నీ మూసుకుని పడుకున్నాడు. కాని మేమునీ అడ్డా అనుకున్న పాతబస్తీకి వస్తున్నామని చెప్పాము. కాని పోలీసులు అంగీకిరించలేదు. తెలంగాణలో నా ధర్మానికి, హిందూ సమాజానికి అన్యాయం జరుగుతున్నపుడు సహించే పిరికితనం బీజేపీకి, కార్యకర్తలకు లేదని సంజయ్ అన్నారు. పాతబస్తీకి పోయి భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయాము. అక్కడ పచ్చ జెండాలు పీకి కాషాయ జెండాలు ఎగరేస్తాము. పాతబస్తీని కొత్త బస్తీగా చేస్తాము. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసిన మజ్లిస్ పాత బస్తీని ఎందుకు అభివృద్ది చేయలేదు? అక్కడ యువతకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు? అక్కడ హిందువులను, వారి ఆస్తులను కాపాడే బాధ్యత తమదని వారికి తాము భరోసా ఇస్తున్నామని అన్నారు.

కేసీఆర్ కుటుంబం దోపిడీ..

సీఎం కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఆరోపించారు. ఏ ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటైందో.. ఆ ఉద్దేశం నెరవేరిందా అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్లు ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు.

Exit mobile version