Site icon Prime9

Digital detox: ఆ గ్రామంలో రోజూ గంటన్నరసేపు టీవీలు, మొబైల్ ఫోన్లు బంద్ .. ఎందుకో తెలుసా?

Digital detox

Digital detox

Digital detox: తెలుగులో వచ్చిన శతమానం భవతి సినిమా లో హీరో తమ గ్రామంలో మొబైల్ సిగ్నల్స్ లేకుండా చేస్తాడు. అంతేకాదు కేబుల్ టీవీ నెట్ వర్క్ ను బంద్ చేయిస్తాడు. దీనితో మరో వ్యాపకం లేకపోవడంతో గ్రామస్దులు కుటుంబాలు, బంధువులు, సన్నిహితులతో మాట్లాడుకుంటూ గడుపుతారు. ఇలా మనుషులు ఒకరితో ఒకరు ఎక్కవసేపు గడపడానికే అతను ఇలా చేస్తాడు. ఇపుడు మహారాష్ట్రలోని ఒక గ్రామంలో రోజుకు గంటన్నరసేపు మొబైల్స్, టీవీలు బంద్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ పిల్లలు చదువుకుంటున్నారని గ్రామస్దులు చెబుతున్నారు.

డిజిటల్ డిటాక్స్.అనేది స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించకుండా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా దూరంగా ఉండే కాలం. ఇపుడు మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని కడేగావ్ తహశీల్ లో మోహితే వడ్గావ్ అనే గ్రామంలో దీనిని పాటిస్తున్నారు. ఈ గ్రామ జనాభా సుమారుగా 3000 వరకు ఉంటుంది. గ్రామంలో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు గ్రామంలోని ప్రతి ఇంట్లో టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు పూర్తిగా మూసి ఉంటాయి. దీనితో విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా చోట్ల, పిల్లలుగ్రూప్ స్టడీ కూడా చేస్తున్నారు.కోవిడ్ లాక్ డౌన్ తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాక పిల్లలు చదువుపై దృష్టి కేంద్రీకరించలేదని గ్రామ సర్పంచ్ తెలిపారు. వారు చదవడం మరియు వ్రాయడానికి ఇష్టపడరు.పాఠశాల సమయానికి ముందు మరియు తర్వాత వారి మొబైల్ ఫోన్‌లలో ఎక్కువగా మునిగిపోయేవారు. పాఠశాలలో ప్రత్యేక అధ్యయన గదులు లేవు. దీనితో ఏమి చేయాలనే ఆలోచనలో భాగంగా డిజిటల్ డిటాక్స్ కు దిగామని తెలిపారు. మొదట్లో గంటన్నర వ్యవధిని ప్రతిపాదించాను.మొబైల్, టీవీ స్క్రీన్‌లకు దూరంగా ఉండడం సాధ్యమేనా అని మొదట్లో సందేహం వచ్చింది.స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహిళా గ్రామసభను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నాం. దీనితో ఆచరణలో మంచి ఫలితాలు వచ్చాయిని వివరించారు.

మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్‌లపై వెచ్చించే సమయం నానాటికీ పెరిగిపోవడం ఈ రోజుల్లో ఆందోళన కలిగించే అంశం. వీటిని అతిగా ఉపయోగించడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కంటి చూపు బలహీనపడటంతో పాటు మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది.

 

 

Exit mobile version