TSPSC Group 4: తెలంగాణలో కొలువుల జాతర మెుదలైంది. దానికి తగినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఒక్కొక్కటిగా పరీక్ష తేదీలను టీఎస్పీఎస్పీ ప్రకటిస్తు వస్తుంది. తాజాగా గ్రూప్ -4 కు సంబంధించిన పరీక్ష తేదీని కమిషన్ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా.. గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్.. గత డిసెంబర్ లో విడుదలైంది.
దరఖాస్తుల ప్రక్రియను మెుదట జనవరి 30 వరకు తుది గడువుగా కేటాయించారు.
కానీ మెుదట్లో సాంకేతిక కారణాలతో.. ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని.. టీఎస్పీఎస్సీ గడువును మరో మూడు రోజులు పొడిగించింది.
ఈ గడువు రేపటితో ముగియనుంది.
టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించనున్న గ్రూప్-4 TSPSC Group 4 పరీక్ష తేదీని ఖరారు చేశారు.
జూలై 1వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొందిTSPSC. ఉదయం పేపర్ 1 ఉండగా.. మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుంది.
మెుదటి పేపర్ ఉదయం ఉదయం 10 గంటల నుంచి.. మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. పేపర్-2 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే నిరుద్యోగులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
మరికొందరికి సమస్యలు ఉండటంతో.. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కమిషన్ తెలిపింది.
తాజా గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 8.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది.
దరఖాస్తుకు మరో రోజు ఉండటం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు.
ఒక్క పోస్టుకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు పోటి పడే అవకాశం ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/