Besharam Rang : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ” పఠాన్ “. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రలలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ రాబోతుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ” బేషరం రంగ్ ” అనే పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో తనదైన శైలిలో అందాలు ఆరబోస్తూ దీపికా కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది అని చెప్పవచ్చు.
అయితే విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కానీ ఈ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై మాత్రం వివాదం చెలరేగింది. సాధారణంగా ఏదైనా సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు కొంతమేర వివాదాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అయితే ఈ వివాదం మాత్రం చినికి చినికి గాలివానగా మారుతోందేమో అనే ప్రశ్న అందరి లోనూ మెదులుతుంది. ఈ పాటను చాలా అశ్లీలంగా చిత్రీకరించారని హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. ఈ మేరకు ట్విట్టర్‌లో బాయ్ కాట్ పఠాన్ సినిమా అని ట్రెండ్ అవుతోంది.
కాగా ముఖ్యంగా దీపికా పదుకొనే దుస్తులపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించి ఈ విధంగా అందాలు ఆరబోయడం పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హిందువుల మనోభావాలను ఈ పాట గాయపర్చిందని ఆరోపిస్తూ… ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, పాటలోని అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలని, హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కూడా వేరేవి ఉండాలని అన్నారు. అలానే ఇండోర్‌లో వీర్ శివాజీ గ్రూప్ సభ్యులు ఇదే సినిమాపై నిరసన తెలిపారు. లేదంటే మధ్యప్రదేశ్‌లో సినిమా ప్రదర్శనకు అనుమతిపై ఆలోచిస్తామన్నారు. దీపికా పదుకోన్ జేఎన్‌యూలో తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతిచ్చారని , ఇలాంటి పాటలో నటించి మరోసారి హిందువుల మనోభావాలు గాయపర్చారని అన్నారు.
Under the Real #Pathaan rule, music is crime, and musicians are criminals who are to be publicly executed.
Do you think self Proclaimed Pathaan @iamsrk will go with @deepikapadukone to discuss with his blood brothers to stop this in ancestral country #Afghanistan? pic.twitter.com/gfH9sayiEA
— Arun Pudur 🇮🇳 (@arunpudur) December 14, 2022
Deepika has done over 30 movies. SRK is the so-called superstar with a 3-decade-long career in Bollywood.
If they still need to do this 👇to sell their movie, it speaks a lot abt d absolute state of B’wood and sheer garbage they produce
Pathetic https://t.co/5QTSpj2OAd
— Sanghamitra (@mitraphoenix) December 12, 2022
इंदौर में जलाया गया शाहरुख खान का पुतला शाहरुख खान की फिल्म पठान के गीत में भगवा रंग का इस्तेमाल किए जाने का हो रहा जगह-जगह विरोध हो रहा है इंदौर के वीर शिवाजी ग्रुप ने विरोध स्वरूप शारूख खान का मालवा मिल चौराहे पर पुतला जलाकर फिल्म का विरोध किया गया #pathan @AmitShah #indore pic.twitter.com/vpAHAtxZPG
— sameer khan (@Sameer18786K) December 14, 2022
బాలీవుడ్‌లో పఠాన్ లాంటి చెత్త సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని , ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు బహిష్కరించాలని అన్నారు హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అన్నారు. బీజేపీని టార్గెట్ చేయడానికే కాషాయ రంగు బికినీ వేసి బేషరమ్ రంగ్ అంటూ పాటను విడుదల చేశారని కొందరు షారుక్ ను ట్రోల్ చేస్తున్నారు.
అయితే, ఈ పాటలో దీపికా మరో రెండు రంగుల బికినీలు కూడా ధరించిందని… దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా వీరికి మద్దతుగా నిలుస్తూ కాషాయ దుస్తులు ధరించిన వారు ద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చినప్పుడు ఫర్వాలేదు, బ్రోకర్ ఎమ్మెల్యేలు, కుంకుమ ధరించిన స్వామీజీ మైనర్లపై అత్యాచారం చేస్తారు, కానీ సినిమాలో డ్రస్సు కాదా ?? అంటూ ప్రశ్నించారు. సినిమాలకు మతం రంగు పులమొద్దు అంటూ పలువురు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు.
#Besharam BIGOTS.. So it’s okay when Saffron clad men garland rapists..give hate speech, broker MLAs, a Saffron clad swamiji rapes Minors, But not a DRESS in a film ?? #justasking
….Protesters Burn Effigies Of SRK In Indore. Their Demand: Ban ‘Pathaan’ https://t.co/00Wa982IU4— Prakash Raj (@prakashraaj) December 15, 2022