Site icon Prime9

Shashi Tharoor : శశిథరూర్‌ కు మొహం చాటేసిన టీ కాంగ్రెస్ నేతలు

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా జరుగుతుంటే .. మరోవైపు అదే స్థాయిలో ఈ నేల 17 వ తేదిన జరిగే ఏఐసీసీ ఎన్నికల పైనే అందరిదృష్టీ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అధ్యక్ష పదవిలో ఉన్న గాంధీ కుటుంబం ఈసారి బరిలో లేకపోవడం. ఇక కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సీనియర్‌ నేతలు మల్లికార్జున్ ఖర్గే , శశిథరూర్ పోటీ పడుతున్నారు.

మల్లికార్జున్ ఖర్గేకి గాంధీ కుటుంబం అశీస్సులు ఉండటంతో ఆయన గెలుపు ఇక లాంఛనమే అని భావిస్తున్నారు. అయితే.. పోటీలో ఉన్న మరొక అభ్యర్థి శశిథరూర్ సైతం అద్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారలో భాగంగా హైదరాబాద్‌కు శశి థరూర్ వచ్చారు. ఆయన రాకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదంటున్నారు నేతలు. శశిథరూర్‌ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై శశిథరూర్ మేనిఫెస్టో తయారు చేశారు. తామంతా ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవన్నారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే స్టాండ్ అని శశిథరూర్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారని, కానీ వెళ్ళలేకపోయానన్నారు. రేవంత్ పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్‌కు వచ్చి ప్రచారం చేసుకుంటానని శశిథరూర్ స్పష్టం చేశారు.మరోవైపు – మల్లికార్జున ఖర్గేకే తమ మద్దతు అని తెలంగాణ కాంగ్రెస్ తేల్చి చెప్పింది. శశిథరూర్ పోటీ నుండి తప్పుకొని ఖర్గేకి మద్దతు ఇవ్వాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కోరారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు మాత్రం శశిథరూర్ పై తీవ్రంగా మండిపడ్డారు. పదిసార్లు వరుసగా గెలిచిన మల్లికార్జున్ ఖర్గేకి గ్రౌండ్ రియాల్టీ తెలుసన్నారు. బ్రిటన్ సంస్కృతిని శశిథరూర్ ఇక్కడకి తీసుకురావాలని చూస్తే ఊరుకోబోమని వీహెచ్‌ హెచ్చరించారు. అటు.. పీసీసీ అధ్యక్షుడిగా న్యూట్రల్ గా ఉంటాను అని చెప్పారు రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌కి వచ్చిన శశిథరూర్ తనకు ఫోన్ చేశారని వెల్లడించారు. ఉదయం కాఫీకి రావాలని పిలిచినట్లు రేవంత్ తెలిపారు. మా దగ్గర బంధువు చనిపోవడం వల్ల శశిథరూర్‌ని కలవలేకపోయాయని రేవంత్‌ చెప్పారు.

తెలంగాణ లో 119 నియోజకవర్గాలకుగాను 238 పీసీసీ డెలిగేట్ ఓట్లు ఉన్నాయ. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని సోనియాగాంధీ సహా కాంగ్రెస్ పెద్దలంతా నిర్ణయించారు. కానీ తానూ పోటీ చేస్తా అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పంతం పట్టారు. దీంతో తమను ఎదురించిన శశిథరూర్ కు కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌లో ఉత్సహాన్ని తీసుకొస్తే మరికొన్ని రోజుల్లో జరిగే ఏఐసీసీ ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలని బట్టబయలు చేశాయి. చివరికి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎవరని వరిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version